ఆంధ్రప్రదేశ్‌

మద్దతు కూడగడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 31: రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు కూడగట్టనున్నట్టు ఎపి పిసిసి చీఫ్ ఎన్ రఘువీరారెడ్డి స్పష్టం చేశారు. విశాఖలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బిల్లుపై సెప్టెంబర్ 5న ఓటింగ్ జరిగే అవకాశం ఉందని, అప్పటికీ ఈ అంశంపై స్పష్టత రాకపోతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం కాంగ్రెస్ పెద్దఎత్తున ఉద్యమాలు చేసిందన్నారు. రాష్ట్రాన్ని విభజించిన పాపం కాంగ్రెస్‌దేనంటూ పదేపదే విమర్శించే తెలుగుదేశం, భారతీయ జనతాపార్టీలకు రాష్ట్రాన్ని ఆదుకునే అవసరం లేదా అని ప్రశ్నించారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు కావస్తున్న తరుణంలో రాష్ట్రానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. విభజన పాపం కాంగ్రెస్‌పై నెడుతున్న తెలుగుదేశం, ఇప్పుడు ప్రత్యేక హోదా అంశంపై రాజ్యసభలో చర్చకు తెరతీసింది కాంగ్రెస్ అన్న సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఈ అంశంపై ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ రాజ్యసభలో ప్రసంగించడానికి కూడా కాంగ్రెస్ కారణమన్నారు. విభజన చట్టం, ప్రత్యేక హోదాపై సెప్టెంబర్ 5న ఓటింగ్ జరిగే క్రమానికి కూడా కాంగ్రెస్ చలవేనని గుర్తు చేశారు. ఇప్పటికైనా చంద్రబాబు కళ్లు తెరిచి, కేంద్రంతో పోరాడైనా విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాకోసం జరిగే పోరులో భాగస్వామ్యం కావాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు విభజన అంశాన్ని బూచిగా చూపి బిజెపి, టిడిపిలు లబ్ధిపొందాయని విమర్శించారు. రాష్ట్రానికి పదేళ్ల పాటు ఇస్తామని బిజెపి ప్రకటించిందని, ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలను సాధించాలంటే కేంద్రంతో టిడిపి తెగతెంపులు చేసుకోవాలని డిమాండ్ చేశారు. హోదాపై రాజ్యసభలో జరిగే ప్రైవేటు బిల్లుకు మద్దతుగా ఇతర రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టాలని హితవు పలికారు.

సమావేశంలో పిసిసి ప్రధాన కార్యదర్శి ద్రోణంరాజు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.