తెలంగాణ

పరశురామునిగా రామయ్య దర్శనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, డిసెంబర్ 16: ఖమ్మం జిల్లా భద్రాచల శ్రీసీతారామచంద్రస్వామి బుధవారం భక్తులకు పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. స్వామికి గర్భగుడిలో ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఉత్సవమూర్తులను పరశురామావతారంలో అలంకరించారు.
ఈ సందర్భంగా స్వామికి నాళాయర దివ్యప్రబంధం, ద్రవిడ ప్రబంధం పారాయణం చేశారు. వేదవిన్నపాల అనంతరం స్వామి ఊరేగింపుగా మిథిలాస్టేడియానికి చేరుకున్నారు. అక్కడ భక్తులకు దర్శనం ఇచ్చాక తిరుమాడ వీధుల్లో తిరువీధి సేవ నిర్వహించారు. గోవిందరాజస్వామి ఆలయంలో పూజలందుకుని తిరిగి ఆలయానికి చేరుకున్నారు. నేటి నుంచి ధనుర్మాసోత్సవాల సందర్భంగా తిరుప్పావై ప్రవచనాలు జరగనున్నాయి.

రూ.1024 కోట్లతో
గోదాంల నిర్మాణం
మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్
చౌటుప్పల్, డిసెంబర్ 16: రాష్ట్ర వ్యాప్తంగా 330 వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో 17 లక్షల సామర్థ్యం కలిగిన గోదాంలను రూ.1024 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నట్లు మార్కెటింగ్ శాఖ కమిషనర్ శరత్ తెలిపారు. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్మాణం జరుగుతున్న గోదాంను బుధవారం ఆయన పరిశీలించారు. నిర్మాణం పనుల నాణ్యతను పరిశీలించారు. మార్కెట్ యార్డులో నాటిన మొక్కల పెంపకాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో మూడు చాంబర్లతో గోదాంల నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఒక చాంబర్ రైతులు తెచ్చిన ధాన్యం నిల్వ చేసుకునేందుకు, రెండవ చాంబర్ రైతులకు అవసరమైన ఎరువులు నిల్వ చేసేందుకు, మూడవ చాంబర్ పూరసరఫరాల బియ్యం నిల్వ చేసేందుకు ఉపయోగించనున్నట్లు వివరించారు. వచ్చే ఖరీఫ్ సీజన్ నాటికి గోదాంల నిర్మాణం పూర్తి జరిగి వినియోగంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. గోదాం పైకప్పులపై సోలార్ ప్యానల్స్‌ను ఏర్పాటుచేసి సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేయనున్నట్లు వివరించారు. ఉత్పత్తి జరిగిన విద్యుత్‌ను మార్కెట్ అవసరాలకు వినియోగించి మిగిలిన విద్యుత్‌ను విక్రయిస్తామన్నారు.
మార్కెట్‌యార్డులో
పర్యటిస్తున్న కమిషనర్ శరత్