ఆంధ్రప్రదేశ్‌

కోడెలపై అనర్హత వేటు వేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 28: అసెంబ్లీ ఎన్నికల్లో తాను రూ. 11.5 కోట్లను ఖర్చుపెట్టినట్లు ఏపి శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు చేసిన ప్రకటనపై చర్యలు తీసుకోవాలని, ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించాలని వైకాపా కేంద్ర ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేసింది. మంగళవారం ఇక్కడ వైకాపా అధికార ప్రతినిధి అంబటి రాంబాబు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఎన్నికల సంఘం నియమావళి ప్రకారం నిర్దేశించిన పరిమితికి లోబడి ఖర్చుపెట్టాల్సి ఉందన్నారు. కాని నిబంధనలకు విరుద్ధంగా ఎక్కువగా ఖర్చు పెట్టినట్లు ఒక శాసనసభ్యుడు బహిరంగంగా ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అంగీకరించినందువల్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని ఆయన కోరారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నికల సంఘం సెక్షన్ 10ఏ ప్రజాప్రాతినిథ్య చట్టం కింద చర్యలు తీసుకోవచ్చన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి రూ. 28 లక్షలకు మించి ఖర్చుపెట్టేందుకు వీలు లేదని, పరిమితి దాటితే ఎన్నికల చట్టం కింద చర్యలు తీసుకునే అధికారం రాజ్యాంగం కల్పిస్తోందన్నారు.