ఆంధ్రప్రదేశ్‌

బీరువా మీదపడి ఎల్‌కెజి విద్యార్థిని మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రొద్దుటూరు, జూన్ 28: బడికి వెళ్లిన మొదటి రోజే ఆ చిన్నారిని మృత్యువు కబలించింది. పాఠశాల ఆఫీసు గదిలోని బీరువా మీదపడడంతో ఎల్‌కెజి విద్యార్థిని భార్గవి(5) మృతి చెం దింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో మంగళవారం జరిగింది. ప్రొద్దుటూరు పట్టణంలోని వాణీ విద్యానికేతన్ పాఠశాలలో ఎల్‌కెజిలో చేరిన చాపాటి భార్గవి(5) మధ్యాహ్నం భోజన విరామం సమయంలో ఆఫీస్ గదిలోని వెళ్లింది. అక్కడ ఉన్న బీరువా చిన్నారిపై పడడంతో తలకు తీవ్రగాయమై అక్కడికక్కడే మృతి చెందింది. లింగాపురం మండలం మూలవారిపల్లెకు చెందిన బేల్దారి నరసింహులు, లక్ష్మీప్రసన్నకు ఓ కొడుకు, కూతురు. భార్గవిని ఆమె అమ్మమ్మ వెంకటమ్మ మంగళవారం పట్టణంలోని వాణీ విద్యానికేతన్‌కు తీసుకువచ్చింది. రూ.3 వేలు ఫీజు కట్టి తరగతి గదిలో వదిలి వెళ్లింది. మధ్యాహ్నం 1:30 గంటల సమయంలో భార్గవి ఆఫీసు గదిలోకి వెళ్లింది. అప్పుడే ఈ దారుణం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న బాలిక అమ్మమ్మ, తల్లిదండ్రులు పాఠశాలకు చేరుకుని భోరున విలపించారు. హెడ్మాస్టర్, టీచర్ల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆరోపించారు. యాజమాన్యం నిర్లక్ష్య వల్లే భార్గవి మృతి చెందిందంటూ ప్రజాసంఘాలు, విద్యార్థిసంఘాలు, ఎమ్మార్పీఎస్ నాయకులు పాఠశాల ఎదుట ఆందోళనకు దిగాయి. జిల్లా విద్యాశాఖాధికారి ప్రతాప్‌రెడ్డి హుటాహుటిన పాఠశాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. పాఠశాల గుర్తింపు రద్దు చేస్తున్నామని, పాఠశాలను సీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రంగంలోకి దిగిన పోలీసులు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దస్తగిరిని అదుపులోకి తీసుకున్నారు.