ఆంధ్రప్రదేశ్‌

చోటు కోసం అగచాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 26: రాజధానికి ఒకదాని వెంట ఒకటిగా ప్రధాన కార్యాలయాలు క్యూ కడుతున్నాయి. పదులు, వందల సంఖ్యలో ఉద్యోగులు తరలివస్తున్నారు. వీరికి వసతి సదుపాయం ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా ఉద్యోగినులు అవస్థ పడుతున్నారు. ఇప్పటికే గుంటూరులో మార్కెటింగ్, చేనేత, జౌళి, మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్, వ్యవసాయశాఖ కమిషనరేట్‌తో పాటు ఇరిగేషన్ చీఫ్ ఇంజనీరు కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో సమాచార, పౌరసంబంధాలశాఖ, ట్రైబల్ వెల్ఫేర్, ఇరిగేషన్, సివిల్ సప్లయిస్ ప్రధాన కార్యాలయాలు ఏర్పాటయ్యాయి. వీటిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులు అధికశాతం మంది కుటుంబాలకు దూరంగా విధులు నిర్వహిస్తున్నారు. వసతి సౌకర్యాలు లేకపోవడంతో సన్నిహితుల ఇళ్లలో ఉంటున్నారు. గుంటూరు మార్కెటింగ్ విభాగం ఉద్యోగినులు ముందుగా రాజధానికి తరలి వచ్చారు. వీరిలో తెలంగాణకు చెందిన ఏపి కేడర్ మహిళా ఉద్యోగులు దీర్ఘకాలిక సెలవులో ఉన్నారు. కాగా కొందరు ఇక్కడి బంధువుల ఇళ్లలో ఉంటున్నారు. మరికొందరు పరిచయస్థుల ఇళ్లలో పేయింగ్ గెస్టులుగా మారారు. ఇక్కడకు వచ్చిన రెండు రోజులు మాత్రమే తమకు సదుపాయాలు కల్పించారని, ప్రైవేటు వర్కింగ్ ఉమెన్స్ హాస్టళ్లలో చేరదామంటే అధిక చార్జీలు డిమాండ్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగినులకు సంబంధించి గుంటూరు, విజయవాడలో ప్రభుత్వపరంగా ఒక్కో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ ఉన్నాయి. వీటిలో ఇప్పటికే 90 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. గుంటూరు హాస్టల్‌లో 20 మందికి, విజయవాడ హాస్టల్‌లో పదిమందికి మాత్రమే ఇక్కడ అవకాశం ఉందని సమాచారం. అయితే ఇందులో చేరాలంటే ప్రభుత్వపరమైన నిబంధనలు పాటించాల్సి ఉందని అధికారులు తెలిపారు. విజయవాడలో 14, గుంటూరులో మరో 20 ప్రైవేటు హాస్టళ్లు అందుబాటులో ఉన్నప్పటికీ అక్కడ నెలకు రూ. 5 వేల నుంచి 10 వేల వరకు చెల్లింపులు జరపాలి. విజయవాడ కరెన్సీనగర్‌లో మహిళా ఉద్యోగుల కోసం రెండు ట్రిపుల్ బెడ్ రూం ప్లాట్లను మహిళా, శిశు సంక్షేమశాఖ సిద్ధం చేసింది. వీటిలో పదిమంది ఉద్యోగుల వరకు సదుపాయాలు ఉంటాయి. అయితే హాస్టల్ అద్దె చూసిన ఉద్యోగినులు వెనుతిరగాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.. నెలకు రూ. 50వేలు భోజన, వసతి సదుపాయాలకు చెల్లించాలని యజమానులు డిమాండ్ చేశారు.
సీనియర్ ఉద్యోగులకు పిల్లల చదువుల సమస్య లేకపోయినా కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోనే స్థిరపడటంతో ఎటూ తోచని స్థితిలో ఉన్నారు. మార్కెటింగ్ శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న అనురాధ తరలింపులో భాగంగా గుంటూరు చేరుకున్నారు. ఆమె భర్త రెవిన్యూ విభాగంలో పనిచేస్తున్నారు. ఇంకా ఆ శాఖ ఏర్పాటు కాలేదు. దీనికితోడు పిల్లలు హైదరాబాద్‌లోనే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎక్కడ నివాసం ఉండాలనేది సందేహాస్పదంగా మారుతోంది.