ఆంధ్రప్రదేశ్‌

సర్వ శిక్షా అభియాన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 24: ఆంధ్రప్రదేశ్ సర్వ శిక్షా అభియాన్‌లో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల గుండెల్లో స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ జి.శ్రీనివాస్ రైళ్లు పరిగెత్తిస్తున్నారు. పిడిగా వచ్చిన నాటి నుండి అన్ని జిల్లాల్లో అక్రమార్కులపై డేగ కన్ను వేసిన శ్రీనివాస్ ఆకస్మిక పర్యటనలు జరుపుతూ రికార్డులను పరిశీలిస్తున్నారు. రెండు రోజులుగా కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటిస్తున్న ఆయన శుక్రవారం గుంటూరు జిల్లా సర్వశిక్షా అభియాన్ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. నిధులు ఖర్చుల లెక్కలు రికార్డుల్లో సరిగా లేకపోవడంతో పిఓ రమేష్‌ను నిలదీశారు. ఇప్పటికే కలెక్టర్ అనుమతి లేకుండా రూ.60.25 లక్షలు ఖర్చుపెట్టినట్టు తెలుసుకున్న ఎస్పీడీ కార్యాలయం గత నెల 12వ తేదీనే పిఓకు షోకాజ్ నోటీసు జారీచేసింది. దానికి పిఓ ఇచ్చిన సమాధానం కూడా సంతృప్తికరంగా లేకపోవడంతో ఎస్పీడీ శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పైగా 53 మంది మెసెంజర్లకు నెలకు రూ.7 వేల చొప్పున ఎమ్మార్సీల నుండి అందాల్సిన పారితోషికాన్ని కూడా తామే చెల్లించినట్టు చూపడాన్ని తప్పుపట్టారు. సివిల్ వింగ్స్‌లో డిప్యూటీ ఇంజనీర్లుగా పనిచేస్తున్న డిఎల్‌ఎన్.రెడ్డి, కెఎల్‌ఎన్.శంకర్, వెంకటేశ్వరరావు నెలల తరబడి అటెండెన్స్ రిజిస్టర్లలో సంతకాలు చేయకపోవడాన్ని గుర్తించి వారికి జీతాలు ఎలా ఇస్తున్నారని ప్రశ్నించారు. గుంటూరుతో పాటు కలెక్టర్ల అనుమతి లేకుండా నిధులు ఖర్చు చేసిన కడప, చిత్తూరు, నెల్లూరు పిఓలు, ఎఫ్‌ఎఓలను కూడా సస్పెండ్ చేయాలని శ్రీనివాస్ ప్రభుత్వానికి సిఫారసు చేశారు. కడప జిల్లాలో కోటి 15 లక్షల 19 వేల రూపాయిలు, నెల్లూరు జిల్లాలో 40 లక్షల 28 వేల రూపాయిలు, చిత్తూరు జిల్లాలో 54 లక్షల 90 వేల రూపాయిలు ఎలాంటి అనుమతి లేకుండా ఖర్చు చేయడంపై ఎఫ్‌సి మాల్యాద్రి ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కమిటీని ఏర్పాటుచేసి విచారణకు ఆదేశించారు. కమిటీ రిపోర్టు సమర్పించిన తర్వాత తదుపరి చర్యలు ఉంటాయని ఎస్‌పిడి చెప్పారు. అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా నిబంధనలకు విరుద్ధంగా నిధులు ఖర్చు చేసినట్టు రిపోర్టులు ఉన్నాయని, త్వరలో ఆ వ్యవహారంపై కూడా విచారణ జరుపుతామని స్పష్టం చేశారు.

నేడు కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ధర్నాలు

హైదరాబాద్, జూన్ 24: తెలంగాణ ప్రభుత్వం పెంచిన విద్యుత్తు, ఆర్టీసీ చార్జీలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన బాట చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ మిగతా ప్రతిపక్షాలను కలుపుకుని ఉద్యమించేందుకు సమాయత్తమవుతోంది. ఆర్టీసీ, విద్యుత్తు చార్జీల భారాన్ని తగ్గించేంత వరకూ ఆందోళనలు కొనసాగించాలని టి.పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగానే శనివారం (25న) రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించి, కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్లు టి.పిసిసి ఉపాధ్యక్షుడు మల్లు రవి శుక్రవారం విలేఖరుల సమావేశంలో తెలిపారు. బంగారు తెలంగాణ చేస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి బాధల తెలంగాణగా మార్చేశారని విమర్శించారు. ధనిక రాష్టమ్రని చెప్పే ముఖ్యమంత్రి కెసిఆర్ ఇప్పుడు ఆర్టీసీ, విద్యుత్తు చార్జీలు ఎందుకు పెంచారని ఆయన ప్రశ్నించారు.

అర్చకుల బదిలీ ఆక్షేపణీయం
ఏపి అర్చక సమాఖ్య ధ్వజం

హైదరాబాద్, జూన్ 24: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్ధానంలో పనిచేస్తున్న అర్చకులను బదిలీ చేయడం ఆక్షేపణీయమని ఏపి అర్చక సమాఖ్య ప్రధాన కార్యదర్శి అగ్నిహోత్రం ఆత్రేయబాబు, కార్యనిర్వాహక కార్యదర్శి పెద్దింటి రాంబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగమ సాంప్రదాయాల ప్రకారం అనాదిగా అర్చనాది కైంకర్యాలు చేసే అర్చకులకు, పెరుమాళ్లు, అమ్మవార్లతో ఉన్న అనుబంధాన్ని దూరం చేసే అధికారం ఏ ప్రభుత్వానికి లేదని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగుల మాదిరిగా అర్చకులను బదిలీలు చేయడం ఆగమ సాంప్రదాయాలతో పాటు సుప్రీం కోర్టు గతంలో వెలువరించిన తీర్పుల స్ఫూర్తికి విరుద్ధమని వారు పేర్కొంటూ, అర్చకుల బదిలీకి సంబంధించిన ఆదేశాలను దేవాదాయ శాఖ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.