ఆంధ్రప్రదేశ్‌

ఏపీలో ఉదయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: నాణ్యమైన విద్యుత్‌ను తక్కువ ధరలకు అందించే దిశలో కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ కృషి చేస్తున్నారని, ఇప్పటికే దేశంలో విద్యుత్ మిగులును సాధించారని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అన్నారు. ‘ఉజ్వల్ డిస్కం అస్యూరెన్స్ యోజన’ (ఉదయ్) పథకం అమలుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిస్కంలు, కేంద్ర ప్రభుత్వంతో శుక్రవారం స్థానిక ముఖ్యమంత్రి కార్యాలయంలో ఒప్పందంపై సంతకాలు చేసిన సందర్భంగా చంద్రబాబు పాత్రికేయులతో మాట్లాడారు. ఉదయ్ పథకం వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ అందించేందుకు, ట్రాన్స్‌మిషన్ నష్టాలు మరింత తగ్గించేందుకు ఉదయ్ పథకం దోహదం చేస్తుందన్నారు. ఉదయ్ ఒప్పందంపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ సమక్షంలో అధికారులు సంతకాలు చేశారు.
కేంద్ర ఇంధన శాఖ మంత్రి పియూష్ గోయల్ మాట్లాడుతూ నూరు శాతం విద్యుదీకరణ సాధించిన మూడవ రాష్ట్రంగా దేశంలో ఆంధ్రప్రదేశ్ నిలిచిందని, ఇందుకు ముఖ్యమంత్రి ప్రశంసనీయులని అన్నారు. దేశంలోనే తొలి ‘స్మార్ట్ మీటర్’ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపొందుతుందని పేర్కొన్నారు. స్మార్ట్ మీటర్ ప్రోగ్రామ్ ద్వారా ప్రతి వినియోగదారునకు స్మార్ట్ మీటర్లు అందిస్తామని తెలిపారు. వీటివల్ల విద్యుత్ వినియోగం వంటి అంశాలపై వినియోగదారులకు పూర్తిస్థాయి సమాచారం లభిస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ నష్టాలను 10.19 శాతానికి తగ్గించడం జరిగిందని, ఈ నష్టాలను సుమారు 6 శాతానికి తగ్గించడం ద్వారా అంతర్జాతీయ ప్రమాణాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అందుకోనుందన్నారు. ఉదయ్ పథకం వల్ల విద్యుత్ ఉత్పత్తి వ్యయంలో తగ్గుదల, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఏర్పడుతుందన్నారు. రాష్ట్రంలో 15 లక్షల వ్యవసాయ పంపుసెట్లను అధిక ఇంధన సామర్థ్యం గల పంపుసెట్లతో మార్పు చేసేందుకు ముఖ్యమంత్రి తమను కోరారని మంత్రి అన్నారు. ఈ ఏడాది రూ.5 లక్షల ఇంధన సామర్థ్యం గల పంపుసెట్లను సమకూర్చుతామన్నారు. ఇంధన పొదుపుపై రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు దేశానికే ఆదర్శమని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ఇంధన శాఖ మంత్రి పీయూష్ గోయల్‌ను ముఖ్యమంత్రి శాలువాతో సన్మానించారు.

చిత్రం... సిఎం సమక్షంలో ఉదయ్ పథకంపై ఒప్పందం కుదుర్చుకుంటున్న అధికారులు