ఆంధ్రప్రదేశ్‌

స్విస్ చాలెంజ్‌కి ఓకె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి ప్రాంతంలో రైతుల నుంచి సేకరించిన భూములను లాభదాయకమైన పద్ధతిలో విదేశీ కంపెనీలకు కేటాయించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి పరిశీలించకుండానే ఈ విధానానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారంటూ వస్తున్న అభియోగాలను సిఎం తోసిపుచ్చారు. మొత్తం పద్ధతిగానే జరుగుతున్నదని వివరించారు. స్విస్ ఛాలెంజ్ విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశం గంటకు పైగా వివిధ కోణాల్లో చర్చించిన పిదప ఆమోదం తెలిపింది. 45 రోజుల్లో పూర్తిస్థాయిలో అన్ని రకాల లావాదేవీలను పూర్తిచేసి నోటిఫికేషన్ జారీచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీ కన్సార్టియంకు 1691 ఎకరాలు, రాజధానిలోనే ఇండో-యుకె హెల్త్ ఇన్‌స్టిట్యూట్‌కు ఎకరానికి రూ.50 లక్షలు చొప్పున 150 ఎకరాలు, దాదాపు 50వేల మందికి పైగా దేశ, విదేశీ విద్యార్థులకు శిక్షణ అందించే విఐటికి ఎకరాకు రూ.50 లక్షల విలువతో 200 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. ఎన్‌ఎంసి బిఆర్‌సి షెట్టి కంపెనీకి 150 ఎకరాలను ఇచ్చేందుకు తదుపరి మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. రాష్టవ్య్రాప్తంగా అనేక సంస్థలకు మరో 3,500 ఎకరాల భూములను కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. సమావేశం అనంతరం విలేఖరులతో సిఎం చంద్రబాబు మాట్లాడుతూ కొన్ని దేశాలు భాగస్వాములైతే మినహా రాజధానిని కట్టలేమనే నిర్ణయానికి వచ్చి ఆ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. ప్రభుత్వం ఇచ్చే భూములపై వచ్చే ఆదాయంలో సింగపూర్ ప్రభుత్వ యాజమాన్యంలోని కంపెనీలు అసెండాస్-సింగ్‌బ్రిడ్జి, సెంబ్‌కార్ఫ్ సంస్థలకు 58 శాతం, రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసే అమరావతి డెవలప్‌మెంట్ కంపెనీకి 42 శాతం వాటా రానున్నదని సిఎం చెప్పారు. దశలవారీగా మొత్తం 1691 ఎకరాలను ఈ కంపెనీలకు కేటాయించనున్నారు. తొలుత 50 ఎకరాలను నామమాత్రపు ధరపై ఇచ్చేసి ఫేజ్-1లో 200 ఎకరాలను ఎకరా రూ.4కోట్ల చొప్పున కేటాయించాలని కూడా నిర్ణయించటం జరిగిందని సిఎం తెలిపారు. మొదటి 50 ఎకరాలను ఐకానిక్ బిల్డింగ్ కోసం కేటాయించటం జరిగిందన్నారు. ఈ భూముల్లో దేశ విదేశాల్లో ప్రతిష్ఠాకరమైన కంపెనీలకే చోటు కల్పించాలనే నిర్ణయం కూడా జరిగిందన్నారు. వౌలిక సదుపాయాల కల్పనలో కొంత భాగాన్ని సంబంధిత కంపెనీలు ఖర్చుచేయాల్సి వస్తుందన్నారు. మొదటిసారి రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీ నుంచి మినహాయింపు కల్పించనున్నామని అందులో జరిగే కట్టడాలకు అందించే ఇసుకకు క్యూబిక్ మీటరుకు రూ.500 ధర చెల్లించేలా నిర్ణయం జరిగిందన్నారు.
విజయనగరం జిల్లా కోతక్కి గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఎపిఐఐసికి ఎకరా రూ.4 లక్షలు చొప్పున 187 ఎకరాలు, విశాఖ జిల్లా వల్లూరు గ్రామంలో మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్ ఏర్పాటుకు ఎపిఐఐసికి ఎకరా రూ.10 లక్షలు చొప్పున 286 ఎకరాలు, నెల్లూరు జిల్లా కొత్తపట్నం గ్రామంలో ఇండస్ట్రియల్ పార్క్‌కు ఎకరా రూ.31వేలు చొప్పున 1018 ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లా వట్లూరు, భోగాపురం గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌కు ఎకరాకు రూ.12 లక్షలు చొప్పున ఎపిఐఐసికి 350 ఎకరాలు, నెల్లూరు జిల్లా కర్లపూడిలో ఇండస్ట్రియల్ పార్క్‌కు ఎకరా రూ.60వేలు చొప్పున 384 ఎకరాలు, నెల్లూరు జిల్లా కలవకొండ, ఉడతలవారిపాలెం గ్రామాల్లో ఇండస్ట్రియల్ పార్క్‌కు ఎకరా లక్షన్నర చొప్పున 638 ఎకరాలు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్టూల్ డిజైన్‌కు 50 ఎకరాలు, విశాఖ జిల్లా మాడుగుల మండలంలో డిఆర్‌డివో ప్రాజెక్టు స్థాపనకు ఎకరా రూ.8లక్షలు చొప్పున 938 ఎకరాలు కేటాయించేందుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. అలాగే మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులు తమకు కేటాయించిన భూములను పదేళ్ల తరువాత అమ్ముకునేందుకు అవసరమైన ఎన్‌వోసిని రద్దు చేస్తూ మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది. విశాఖ జిల్లా గాజువాకలో 10వేల మందికి లబ్దికలిగించే నిర్మాణాల క్రమబద్ధీకరణకు కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సింహాచలం భూముల్లో నిర్మాణాల క్రమబద్ధీకరణపై సానుకూల నిర్ణయం తీసుకోవటం జరిగింది. వంశధార ప్రాజెక్టు పూర్తి చేసేందుకు రూ.434 కోట్లు కేటాయించారు. ఎర్రగొండ్ల మండలం నిడుదువ్వి గ్రామంలో హైదరాబాద్‌కు చెందిన తేజా సిమెంట్స్‌కు ఎకరా రెండున్నర లక్షల చొప్పున 141 ఎకరాలు కేటాయించాలని నిర్ణయించారు. తాడేపల్లిగూడెంలో ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 1.5 ఎకరాలు శాప్‌కు కేటాయించటం జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటుకు 5 ఎకరాల భూమిని కేటాయించారు.

చిత్రం... మంత్రివర్గ సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు