ఆంధ్రప్రదేశ్‌

చిన్నారికి నేనున్నా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: తొమ్మిది నెలల పసిపాప జ్ఞానసాయికి వచ్చిన కష్టానికి ఏపి సిఎం చంద్రబాబు చలించిపోయారు. కాలేయ వ్యాధితో బాధపడుతున్న ఈ చిన్నారిని ఆదుకునేందుకు ఎంత డబ్బు ఖర్చయినా వెనుకాడబోమని హామీ ఇచ్చారు. ములకలపల్లి మండలం ఆర్‌ఎస్ కొత్తపల్లి గ్రామంలో నిరుపేదలైన జె రమణప్ప, సరస్వతి దంపతుల బిడ్డ జ్ఞానసాయి పుట్టిన నాటి నుంచి కాలేయ సమస్యతో బాధపడుతోంది. వైద్య శాస్త్ర పరిభాషలో బిలిరియా అట్రాసియా అంటారు. చికిత్స కోసం ఇప్పటికే ఏడు లక్షలు ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో దిగాలు పడిన ఆ తల్లిదండ్రులు చివరకు బిడ్డను చంపుకోవడానికి సిద్ధపడ్డారు. కారుణ్య మరణానికి అనుమతి ఇవ్వాలంటూ తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ వ్యవహారం తమ పరిధిలో లేదంటూ కోర్టు కేసు కొట్టేంది. ఈ వ్యవహారాన్ని శుక్రవారం మీడియా వెల్లడించడంతో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ చిన్నారి జ్ఞానసాయి విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన చంద్రబాబు బాలికకు అయ్యే వైద్య ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని ప్రకటించారు. గ్లోబల్ ఆసుపత్రి వైద్యులతో మాట్లాడి, ప్రపంచంలోనే అత్యుత్తమ డాక్టర్లను ఎంపిక చేసి చిన్నారికి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. జ్ఞానసాయి వైద్యానికి కనీసం రూ.30 లక్షలు వ్యయం కాగలదని బాలికను పరిశీలించిన వైద్యులు అనంతరం తెలియజేయగా తక్షణం ఆ మొత్తాన్ని అందజేయాల్సిందిగా అధికారులను సిఎం ఆదేశించారు.

జ్ఞానసాయతో తల్లిదండ్రులు (ఫైల్)