ఆంధ్రప్రదేశ్‌

రండి... దయచేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 24: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ, వైద్య డైరెక్టరేట్ కార్యాలయం, సిబ్బంది వేర్వేరు బస్సులలో శుక్రవారం నగరానికి చేరుకున్నారు. వీరికి ఎన్జీవో సంఘ పశ్చిమ కృష్ణా అధ్యక్షుడు విద్యాసాగర్ నేతృత్వం లో నాయకులు పుష్పగుచ్ఛాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు. ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటైన సమాచార కార్యాలయాన్ని మంత్రి పల్లె రఘునాథరెడ్డి పూజాదికాలు నిర్వహించి ప్రారంభించారు. డిఎంఇ కార్యాల యం పాత ప్రభుత్వాసుపత్రిలో ఏర్పాటైంది. ఇదిలాఉండగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి కమిషనర్ కార్యాలయం ఈ నెల 27న విజయవాడకు రానుంది. నక్కల రోడ్డులోని చరితశ్రీ ఆసుపత్రిలో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. వ్యవసాయ శాఖకు చెందిన సిబ్బంది గురువారమే గుంటూరు చేరుకున్న సంగతి తెలిసిందే.
సహకార శాఖను ఉన్నతంగా తీర్చిదిద్దాలి
గుంటూరు: రైతుల అభివృద్ధికి ఇతోధికంగా సేవలందించే సహకార శాఖను రాష్ట్రంలోనే ఉన్నతంగా తీర్చిదిద్దాలని ఆ శాఖ కమిషనర్ శేషగిరిబాబు పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరు శ్యామలానగర్‌లోని సహకార శాఖ డైరెక్టరేట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషగిరిబాబు మాట్లాడుతూ తక్కువ సమయంలోనే హైదరాబాదు నుంచి డైరెక్టరేట్‌ను ఇక్కడకు తీసుకువచ్చేందుకు, తరలివచ్చేందుకు సహకరించిన ఉద్యోగులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
హైదరాబాద్ నుంచి సహకార శాఖ డైరెక్టరేట్ కార్యాలయంలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న సుమారు 150 మంది ఉద్యోగులు శుక్రవారం గుంటూరుకు విచ్చేశారు. వీరికి ఎపి ఎన్జీవో, స్థానిక సహకార శాఖ ఉద్యోగులు పుష్పగుచ్ఛాలు, రోజాలతో ఘనస్వాగతం పలికారు. జిల్లా సహకార శాఖ అధికారి పాండురంగారావు నేతృత్వంలో స్థానిక ఉద్యోగులు హైదరాబాద్ నుండి వచ్చిన డైరెక్టరేట్ ఉద్యోగులకు దగ్గరుండి అన్ని సౌకర్యాలు కల్పించారు.

చిత్రం.. విజయవాడ చేరుకున్న ఎస్‌ఐసి ఉద్యోగులకు మిఠాయిలు పంచి
స్వాగతం పలుకుతున్న విద్యాసాగర్