ఆంధ్రప్రదేశ్‌

జలశుద్ధి, వ్యవసాయ రంగాల్లో ఏపికి ఆస్ట్రియా సహకారం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: వ్యవసాయం, జలశుద్ధి అంశాల్లో తాము అభివృద్ధి చేసిన నూతన సాంకేతికత, ఆవిష్కరణలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టేందుకు ఆస్ట్రియా దేశం ముందుకొచ్చింది. ఏపిలో తయారీ రంగ పరిశ్రమలు నెలకొల్పేందుకు తమ దేశానికి చెందిన పెట్టుబడిదారులు ఆసక్తిగా ఉన్నారని ఆస్ట్రియా ఉప రాయబారి జార్ట్ జెట్నర్ తెలిపారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఆస్ట్రియా ప్రతినిధులు భేటీ అయ్యారు. వివిధ అంశాల్లో కలిసి పని చేయడానికి 2003లో ఏపి ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం చేసుకున్న తొలి దేశం తమదేనని ఆస్ట్రియా ఉప రాయబారి ఈ సందర్భంగా గుర్తు చేశారు. మళ్లీ అదే ముఖ్యమంత్రి సారథ్యంలో ఏపి ప్రభుత్వంతో అదే అవగాహనతో ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతో వచ్చామని తెలిపారు. ఇక్కడి వ్యవసాయ క్షేత్రాలకు, రైతులకు ఉపకరించే నూతన ఆవిష్కరణలు, సాంకేతిక విధానాలపై ఏపి ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఆస్ట్రియా ప్రతినిధులను కోరారు. ముఖ్యంగా జలశుద్ధి, వ్యవసాయం, పర్యాటక రంగాల్లో ఆస్ట్రియా దేశం అభివృద్ధి చేసిన సాంకేతికతను ఏపిలో ప్రవేశపెట్టాలని సూచించారు. అందుకు సంపూర్ణ సహకారం అందిస్తామని ఆస్ట్రియా ఉప రాయబారి ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.