ఆంధ్రప్రదేశ్‌

అడుగేస్తే.. అపార్ట్‌మెంట్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 22: నవ్యాంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతికి వేల సంఖ్యలో 27లోగా సచివాలయం, డైరెక్టరేట్, కమిషనరేట్‌ల అధికారులు, ఉద్యోగులు హైదరాబాద్ నుంచి వేల తరలి వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో వందల సంఖ్య లో ఆకాశ హర్మ్యాలు, వేల సంఖ్యలో ఫ్లాట్లు వెలిశాయి. కృష్ణ, గుంటూరు జిల్లాల్లో, ప్రధానంగా సచివాలయ పరిసరాల్లోని 29 గ్రామాలు, అలాగే జాతీయ రహదారి వెంబడి యుద్ధ ప్రాతిపదికన ఇవి వెలిశాయి. వీటన్నింటికీ సరైన అనుమతులున్నాయా లేవా అనేది ఆ తర్వాత విషయం. రాజధాని పుణ్యమా అని ఎకరం భూమిపై దాదాపు రెండు కోట్లు వరకు చేతికి అందటంతో అందులోని నల్లడబ్బును కొందరు బహుళంతస్తు భవనాలపై కుమ్మరించారు. ఏది ఏమైనా అపరిశుభ్ర వాతావరణంతో అడవుల్లా కన్పించే గ్రామ శివారులు ప్రస్తుతం దేదీప్యమానంగా శోభిల్లుతున్నాయి. భవన యజమానులు క్షణాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించుకుంటున్నారు కాని గ్రామ పంచాయతీల్లో నిధులు లేక వీధి దీపాలు ఏర్పా టు కాని దుస్థితి. అలాగే రహదారులు, మురుగుకాల్వలు, మంచినీటి పైప్‌లైన్‌లు వంటి కనీస వౌళిక సదుపాయాలు కూడా ఏర్పడటం లేదు. అయితేనేమి అపార్ట్‌మెంట్‌లో డబుల్ బెడ్‌రూమ్ కల్గిన ఒక్కో ప్లాటు అద్దె కనీసం రూ.12 వేల నుంచి 15వేలు, త్రిబుల్ బెడ్‌రూమ్ అద్దె రూ.20వేలు వరకు పలుకుతున్నప్పటికీ ఇప్పటికే అనేకమంది అడ్వాన్స్‌లు ఇచ్చేసి గృహ ప్రవేశమయ్యారు. అధికారులు, ఉద్యోగులే గాక అతిపెద్ద వ్యాపారాలు నిర్వహించుకోదలచినవారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చి అద్దెలకు దిగుతున్నారు. గ్రామాల్లో బహుళంతస్తుల భవనాలు వెలుస్తున్నాయి గాని వాటిపై ఆస్తిపన్ను విధించే ప్రక్రియ నేటివరకు ఆరంభం కాలేదు. అసలు నిన్న మొన్నటి వరకు ఆ ఖాళీ స్థలాలపై విఎల్‌టి పన్ను కూడా లేదు. పంచాయతీల్లో ఆస్తిపన్ను విధానం రెండు రకాలుగా కొనసాగుతున్నది. ఒకటి కేపిటల్ వాల్యూ అంటే స్థలం విలువ, అందులో నిర్మితమైన భవనం విలువ మొత్తంలో 10 శాతం తరుగుదల తీసి అందులో ఆస్తిపన్నును నిర్ధారిస్తారు. అదీ సమీపంలో పన్ను చెల్లించబడే స్థలం విలువ ఆధారంగానే వుంటుంది. ఉదాహరణకు ఒక ఆర్‌సిసి శ్లాబ్‌కు చ.మీకు వెయ్యి నుంచి 2వేలు వరకు విలువ లెక్కిస్తారు. అసలు గ్రామాల్లో అత్యధిక ఆర్‌సిసి శ్లాబ్ భవనాలకు ఆస్తిపన్ను విధించబడలేదనేది ఆంధ్రభూమి ప్రతినిధి సర్వేలో వెల్లడైంది. ఓట్లు, కుల, వర్గ, పార్టీ, రాజకీయాల కారణంగా సర్పంచ్‌లెవరూ కూడా ఆస్తిపన్ను విధించడం.. ఆపై వసూలు చేయడంపై ఏ మాత్రం శ్రద్ధ వహించలేదు. దీనివలనే ఆదాయం లేక పంచాయతీలు ఈసురోమంటున్నాయి. ఇక రెండో విధానం అద్దెల ప్రాతిపదికన.. ఉదాహరణకు ఒక భవనంలో నాలుగు పోర్షన్‌లు ఉండి మూడింటిని నెలకు వెయ్యి రూపాయలు చొప్పున అద్దెకు ఇస్తే యజమాని ఉండే పోర్షన్‌కు కూడా అదే మొత్తాన్ని కల్పి 12 మాసాలకు విలువ నిర్ధారించి అందులో ఆస్తి పన్ను ఖరారు చేస్తారు. అదనంగా 8 శాతం గ్రంథాలయ పన్ను, ఒక శాతం ఫైర్‌టాక్స్, వాటర్, ట్రైనేజి టాక్స్‌లు కూడా ఉంటాయి.
ఇదిలా వుండగా ప్రభుత్వం రాజధాని ఉద్యోగులకు 30 శాతం హెచ్‌ఆర్‌ఎ ప్రకటించింది. సగటున 50వేలు బేసిక్ కల్గిన ఉద్యోగులే అధికంగా వున్నారు. అయితే హెచ్‌ఆర్‌ఎ 20వేలు వరకు సీలింగ్ ఉంటుంది. ఈమేర ఉద్యోగులందరూ ఫారం 16లో ఐటి రిటర్న్ కూడా దాఖలు చేస్తారు. అలాగే ప్రస్తుతం అమరావతిలో అద్దెలు కూడా అదే విధంగా వున్నాయి. ఒక అపార్ట్‌మెంట్‌లో కనీసం సగటున 20 ప్లాట్లు వుంటే నెలకు ఒక్కోదానికి కనీసం 15వేలు చొప్పున 3 లక్షలు సంవత్సరానికి 36 లక్షలు అద్దెలు వస్తే ఆమేర ఆస్తిపన్నును విధించాల్సి వుంది. అయితే ఏ గ్రామంలోనూ నేటివరకు ఆ ప్రక్రియ ఆరంభం కాలేదు. పైగా సర్పంచ్‌ల ద్వారా ఎమ్మెల్యేలు ఆపై మంత్రులపై ఒత్తిళ్లు కూడా వస్తుండటంతో అందరూ చోద్యం చూస్తున్నారు. పోనీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎటూ నిత్యం ఆ ఆకాశహార్య్మాలను చూసినప్పుడైనా ఆ గ్రామానికి ఆస్తి పన్ను ఎంత వస్తున్నదో తెలుసుకోటానికి ప్రయత్నించకపోవటం బాధాకరం. అదే విజయవాడ కార్పొరేషన్ ఇతర మున్సిపాల్టీల్లో అయితే ఇంటి శంకుస్థాపన రోజే బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు ఆ ప్రాంత కార్పొరేటర్లు, కౌన్సిలర్లు డేగల్లా వాలిపోతుంటారు. ఆస్తి పన్ను విధింపు ప్రక్రియ కూడా త్వరితగతిన ప్రారంభం అవుతుంది. అదే రీతిలో గ్రామాల్లో జరిగినప్పుడే ఆదాయ వనరులు పెరుగుతాయి.

చిత్రం... కొత్తగా పుట్టుకొచ్చిన అపార్ట్‌మెంట్లు

నిమ్మరాజు చలపతిరావు