ఆంధ్రప్రదేశ్‌

ఫాస్ట్.. ఫాస్ట్‌గా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 20: ఆంధ్రప్రదేశ్‌కు రవాణా సౌకర్యాన్ని విస్తరింపచేసేందుకు కొత్త రైలుమార్గాలను చేపట్టడంతోపాటు సింగిల్ రైలు మార్గాలను డబ్లింగ్ చేయటం, దశలవారీగా అన్ని రైల్వే స్టేషన్లను వౌలిక సదుపాయాల కల్పనతో ఆధునికీకరించేందుకు నడుం కట్టినట్లు రైల్వే మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి సోమవారం రాత్రి మూడు బృహత్తర ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టారు. విజయవాడ- సికింద్రాబాద్ మధ్య సింగిల్ హాల్ట్‌తో నడిచే ఇంటర్ సిటీ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జెండా ఊపి ప్రారంభించారు. రూ.323 కోట్ల వ్యయంతో చేపట్టే గుంతకల్- కల్లూరు రైల్వేలైన్ డబ్లింగ్‌కు (40 కి.మీ), నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో 146 ఎకరాల్లో రూ.240 కోట్లతో చేపట్టనున్న మల్టీమోడల్ లాజిస్టిక్ పార్క్‌కు శంకుస్థాపన చేశారు. ఈ మూడు ప్రాజెక్టులను రైల్వే స్టేడియం నుంచి రిమోట్ వీడియో లింక్ ద్వారా చేపట్టారు. ఈసందర్భంగా జరిగిన సభలో సురేష్ ప్రభు మాట్లాడుతూ.. విజయవాడ- అమరావతి మధ్య ఏడు కిలోమీటర్ల మేర కొత్త రైలుమార్గం నిర్మాణానికి త్వరలోనే సర్వే పనులు ప్రారంభిస్తామని ప్రకటించారు. మచిలీపట్నం- గుడివాడ- భీమవరం మధ్య డబ్లింగ్ పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, తిరుపతి-కుప్పం మధ్య కొత్త రైలుమార్గం నిర్మాణానికి సర్వే ప్రారంభిస్తామని చెప్పారు. సుమారు వెయ్యి కోట్ల రూపాయలు వెచ్చించి రాష్ట్రంలోని ఓడరేవులకు రైలుమార్గాలను అనుసంధానం చేసేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఆయన వివరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ నేడు శంకుస్థాపన చేసిన రెండు ప్రాజెక్టుల పనులు కచ్చితంగా నెలరోజుల్లో ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టనున్నామని తెలిపారు. రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రతి రెండు నెలలకోసారి రాష్ట్రంలో పర్యటిస్తూ తన శాఖాపరంగా ఏదో ఒక అభివృద్ధి పనికి శంకుస్థాపన చేయాలని కోరారు. 974 కి.మీ.ల సముద్రతీరంలో కొత్తగా మరికొన్న ఓడరేవుల నిర్మాణాన్ని చేపట్టబోతున్నామని, అన్నింటికీ కంటైనర్లు నడిపేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. చెన్నై- ఢిల్లీ, విశాఖ- బెంగళూరు మధ్య నడిచే రైలు విజయవాడ మీదుగా వెళ్లేలా చూడాలన్నారు. అతి తక్కువ సమయంలో ఉత్పత్తులను రవాణా చేసేందుకు ముంబై- నాగపూర్- ఖరగ్‌పూర్, చెన్నై- విజయవాడ- ఖాజీపేట- ఢిల్లీ, రాయపూర్- విశాఖ- విజయవాడ- ముంబై మధ్య కంటైనర్లు నడిపేందుకు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించాలని కోరారు. భవిష్యత్‌లో అమరావతి ప్రధాన రైల్వే కూడలి ప్రాంతం కావాల్సి వుందన్నారు. తొలివిడతగా కాకినాడ- విశాఖ ఓడరేవులకు ప్రత్యేక రైల్వే కంటైనర్లు నడిపేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. సికింద్రాబాద్‌కు ప్రారంభించిన ఇంటర్‌సిటీ రైలు 5.30 గంటలకు కాకుండా కనీసం 3.30 నుంచి 4గంటల లోపు గమ్యస్థానానికి చేరేలా చర్యలు తీసుకోవాలని కోరారు.

చిత్రం... విజయవాడ-సికింద్రాబాద్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు పచ్చజెండా ఊపుతున్న కేంద్ర రైల్వే మంత్రి సురేశ్‌ప్రభు, ముఖ్యమంత్రి చంద్రబాబు,
పక్కన ఇంటర్ సిటీ రైలు