ఆంధ్రప్రదేశ్‌

ఉత్తర కోస్తాకు వర్ష సూచన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూన్ 17: పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్రను ఆనుకుని ఏర్పడిన ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతోంది. ఇది మరింత బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో ఉత్తర కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు. అలాగే రాయలసీమ జిల్లాల్లో సైతం ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే రుతుపవనాలు కోస్తా, రాయలసీమ జిల్లాల్లో విస్తరించాయి. దీనికి ఉపరితల ఆవర్తనం తోడు కావడంతో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో మరో రెండు రోజుల తరువాత రుతుపనాల ప్రభావం ఉంటుందని తెలిపారు. ఇదిలా ఉండగా ఉపరితల ఆవర్తనం, రుతుపవనాల ప్రభావంతో గురువారం అర్థరాత్రి నుంచి ఉత్తరాంధ్రలో వర్షాలు కురిశాయి.