ఆంధ్రప్రదేశ్‌

దేశంలోనే తొలిసారిగా ఇ-క్రాప్ బుకింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 17: దేశంలోనే తొలిసారిగా ఇ-క్రాప్ బుకింగ్‌ను రాష్ట్రంలో ప్రవేశపెడుతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వ్యవసాయం, అనుంబంధ రంగాలపై ఆయన శుక్రవారం రాత్రి తన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్ వరి దిగుబడిలో దేశంలో ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో నిలిచిందని, రబీ దిగుబడిలో రెండో స్థానాన్ని దక్కించుకుందని చెప్పారు. ఖరీఫ్, రబీ కలిపి హెక్టారుకు 5056 కిలోల వరి దిగుబడి సాధించిన మన రాష్ట్రంలో నెల్లూరు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు మొదటి మూడు స్థానాల్లో నిలచాయని ఆయన తెలియచేశారు. వరి దిగుబడిలో శ్రీకాకుళం జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ఏడు ముఖ్య పంటల దిగుబడి పెంచేందుకు ఏడు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు సిఎం ప్రకటించారు. ఈ బృందాలు ఆయా పంటలను నిరంతరం పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు. పత్తి ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే నాలుగో స్థానంలో ఉందని, కందుల ఉత్పత్తిలో 17వ స్థానం, మినుముల ఉత్పత్తిలో రాష్ట్రానికి రెండో స్థానం, వేరుశనగ ఉత్పత్తిలో 15వ స్థానాన్ని ఆక్రమించుకుందని చంద్రబాబు చెప్పారు. ఈ నెలాఖరుకు వర్షాలు రాకపోయినా, రెయిన్ గన్స్ వంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో వాణిజ్య పంటల సాగును మొదలుపెట్టాలని సిఎం ఆదేశించారు. 2016-17లో వ్యవసాయ యాంత్రీకరణకు 286.27 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చంద్రబాబు తెలిపారు. వ్యవసాయ పనిముట్ల తయారీదారులతో సమావేశం ఏర్పాటు చేసి ఎక్విప్‌మెంట్ బ్యాంక్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.ఈ ఏడాది 9.86 లక్షల హెక్టార్ల భూమిలో అదనంగా సాగు చేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్టు చంద్రబాబు చెప్పారు.