ఆంధ్రప్రదేశ్‌

పది శాతం వడ్డీతో.. రైతులకు రుణమాఫీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, జూన్ 17: రెండో విడత రైతు రుణమాఫీలో భాగంగా 10 శాతం వడ్డీతో కలిపి 3512 కోట్ల రూపాయలను 32,09,457 మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనరేట్‌లో 13 జిల్లాలకు చెందిన అధికారులతో జరిగిన సమీక్షా సమావేశానంతరం ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం తొలుత ప్రకటించిన విధంగా రెండోవిడత రైతు రుణమాఫీ పత్రాలను 22న ప్రకాశం జిల్లాలో సిఎం రైతులకు అందజేస్తారన్నారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈనెల 20వ తేదీన ఏరువాక పౌర్ణమి కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని, అదే సమయంలో రాష్ట్రంలోని మిగిలిన నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 80 రైతు బజార్లు ఉన్నాయని, మరో 11 రైతు బజార్లను ప్రారంభించనున్నట్లు తెలిపారు. 60 రైతు బజార్లను ఆధునీకరించి అన్ని సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ప్రజలు కోరితే మరిన్ని రైతు బజార్లు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సంసిద్ధంగా ఉందన్నారు. ఈ-మార్కెటింగ్ వలన రైతులు లాభపడుతున్నారని మంత్రి వెల్లడించారు.