తెలంగాణ

కొత్త జిల్లాలు 14

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 7: రాష్ట్రంలో కొత్తగా 14నుంచి 15 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై అధికారులకు స్పష్టత వచ్చింది. కొత్తగా 15 జిల్లాలుకాకుండా 14 జిల్లాలు ఏర్పాటు చేయాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. కొత్త జిల్లాలతోపాటు 18 రెవిన్యూ డివిజన్లు, 40 మండలాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు సమాచారం. జనాభా, మండలాలు, రెవిన్యూ డివిజన్లు, అసెంబ్లీ నియోజకవర్గాలు, సరిహద్దులు, జోన్ల సరిహద్దులు తదితర సాంకేతికపరమైన కారణాల ఆధారంగా కొత్తగా 14 జిల్లాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని అధికారుల కసరత్తులో తేలింది. కొత్త జిల్లాల ఏర్పాటుపై మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో రెండు రోజులపాటు జరుగుతున్న కసరత్తులో భాగంగా తొలిరోజు మంగళవారం జరిపిన చర్చల సారాంశంపై బుధవారం మరోమారు సిఎస్ రాజీవ్ శర్మ చర్చించనున్నారు. మధ్యహ్నం జరిగే సెషన్‌కు సిఎం కెసిఆర్ హాజరై చర్చిస్తారని అధికారులు భావిస్తున్నారు. తమ కసరత్తును అధికారులు సిఎంకు నివేదించాక ఆయన చేసే కొన్ని సూచనల అనంతరం కొత్త జిల్లాలపై పూర్తి స్పష్టత వస్తుందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఇలాఉండగా, సాంకేతిక అంశాలతోపాటు భవిష్యత్‌లో పెరుగనున్న అసెంబ్లీ నియోజకవర్గాలు, రాజకీయపరమైన కారణాలు, ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న డిమాండ్లను పరిగణనలోకి తీసుకుని వీటిపై కెసిఆర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా కొత్తగా ఏర్పాటు చేయబోయే జిల్లాల అనంతరం ఒక్కో జిల్లా పరిధిలోకి ఐదేసి నియోజకవర్గాలు వచ్చే విధంగా అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనలో హైదరాబాద్ మెట్రో డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్‌ఎండిఎ) పరిధిలో ఎన్ని జిల్లాలు ఏర్పాటు చేయాలన్న అంశంపై కొంత సంక్లిష్టత ఏర్పడగా, కసరత్తు తర్వాత రంగారెడ్డి జిల్లాను మినహాయించి నాలుగు జిల్లాలు ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించినట్టు తెలిసింది. హైదరాబాద్, హైదరాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్, గోల్కొండ నాలుగు జిల్లాలుగా ఏర్పాటు చేసి, రంగారెడ్డి పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్‌ను పూర్తిగా ఈ మూడు జిల్లాల పరిధిలోకి తీసుకురావాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ప్రస్తుత రంగారెడ్డి గ్రామీణ ప్రాంతాన్ని వికారాబాద్ కేంద్రంగా రంగారెడ్డి జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించినట్టు తెలిసింది. రంగారెడ్డి, హైదరాబాద్ కలెక్టర్లతోపాటు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు ఏకాభిప్రాయంతో వీటిని ప్రతిపాదించడంతో ఇదే దాదాపు ఖరారయ్యే అవకాశం ఉందని ఒక అధికారి తెలిపారు.
అధికారుల కసరత్తు తర్వాత పునర్విభజన ప్రకారం రంగారెడ్డి, హైదరాబాద్, హైదరాబాద్ ఈస్ట్, సికింద్రాబాద్, గోల్కొండ, మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, ఆదిలాబాద్, మంచీర్యాల, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెం (్భద్రాచలం), కరీంనగర్, జగిత్యాల, వరంగల్, భూపాల్‌పల్లి, మహబూబాబాద్, నల్లగొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి జిల్లాలు ఉంటాయని సమాచారం.

చిత్రం... మహబూబ్‌నగర్ జిల్లా మ్యాప్‌ను
పరిశీలిస్తున్న ఓ అధికారి