ఆంధ్రప్రదేశ్‌

‘భారత మాతాకు జై’ అనడం జాతికి గర్వకారణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూన్ 5: భారత మాతాకు జై నినాదం భారత జాతికి గర్వకారణమని, దురదృష్టవశాత్తూ ఈ నినాదాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్స్, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ ఆవేదన వ్యక్తంచేశారు. ఈ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ మద్దతివ్వడం దారుణమన్నారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని పద్మనాభ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన బిజెపి కార్యకర్తల సమావేశంలో రవిశంకర్‌ప్రసాద్ ప్రసంగించారు. ‘్భరత మాతాకీ జై’ అనే నినాదం ఎక్కడ వినిపించినా దేశ ప్రజల నరాల్లో ఉత్తేజం నిండుతుందన్నారు. ఈ నినాదాన్ని వ్యతిరేకిస్తున్న వారిని సోనియా, రాహుల్ గాంధీలు విద్రోహ శక్తులతో చేతులు కలిపిన కారణంగా ఖండించడం లేదన్నారు. సోనియా కుటుంబం భారతదేశాన్ని ముక్కలు చేయాలని చూస్తోందని విమర్శించారు. తాము ఈ దేశాభివృద్ధి కోసం పాటు పడుతున్నామని, ప్రపంచ దేశాల్లో భారత్ కీర్తి పతాకాన్ని ప్రథాని మోదీ నాయకత్వంలో ఎగురవేశామన్నారు. తాను స్వీడన్ వెళ్ళినపుడు ఆ దేశ ప్రధాని మోదీని పొగుడుతూ తనకు అత్యంత గౌరవాన్ని ఇచ్చారన్నారు. కాంగ్రెస్ యువనేత రాహుల్ తండ్రి రాజీవ్ గాంధీ, ఆయన నాయనమ్మ ఇందిరాగాంధీ, తాత నెహ్రూలు ప్రధానమంత్రులుగా పనిచేశారని, కింది స్థాయి ప్రజల కష్టాలు రాహుల్‌కు ఎంతమాత్రం తెలియవన్నారు. ప్రధాని మోదీ అట్టడుగు వర్గం నుండి వచ్చిన ఛాయ్‌వాలా కావడంతో పేద ప్రజల కష్టాలను తెలుసుకుని, వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని పేర్కొన్నారు. నష్టాల్లో ఉన్న భారత టెలికం, తపాలా రంగాలను లాభాల్లోకి తీసుకువచ్చినట్టు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో స్పెక్ట్రమ్, బొగ్గు కొనుగోళ్ళు వంటి అనేక కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. మోదీ ప్రభుత్వం అత్యంత పారదర్శకమైన పాలనను దేశ ప్రజలకు అందిస్తోందని రవిశంకర్‌ప్రసాద్ చెప్పారు.
సమావేశంలో పాల్గొన్న కేంద్ర గ్రామీణావృద్ధి సహాయ మంత్రి సురేష్ భగత్ మాట్లాడుతూ దేశంలో అత్యధిక సభ్యత్వాలను కలిగిన పార్టీగా బిజెపి అగ్రస్థానంలో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు సామాన్యులకు చేరుతున్నాయన్నారు. మోదీ నాయకత్వంలో బిజెపి ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడి రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా దేశ వ్యాప్తంగా వికాస్ పర్వ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఎపి బిజెపి అధ్యక్షుడు, విశాఖపట్నం ఎంపి డాక్టర్ కంభంపాటి హరిబాబు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బిజెపి జిల్లా అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య, మాజీ అధ్యక్షుడు వేటుకూరి సూర్యనారాయణరాజు, బిజెపి కాకినాడ నగర అధ్యక్షుడు ఎన్‌వి సాయిబాబా, ఐటి సెల్ జిల్లా కన్వీనర్ పెద్దిరెడ్డి రవికిరణ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కర్రి చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.