ఆంధ్రప్రదేశ్‌

బాబు, కెసిఆర్... ఇద్దరూ అవినీతిపరులే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూన్ 5: ఆంధ్రప్రదేశ్ సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం కెసిఆర్‌ల మధ్య విభేదాలు కొనసాగలన్నదే ప్రధాని మోదీ ఆలోచన అని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. తిరుపతిలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమ రాష్ట్రాల అభివృద్ధి కోసం ఇటు చంద్రబాబు కాని అటు కెసిఆర్ కాని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడం లేదన్నారు. కెసిఆర్ ఢిల్లీకి వెళ్లేముందు ప్రత్యేక ప్యాకేజీలు తీసుకువస్తానని, బంగారు తెలంగాణను తీసుకువస్తానని ప్రధాని మోదీ వద్దకు వెళతారన్నారు. గదిలోకి వెళ్లిన తరువాత తన కుమార్తెకు మంత్రి పదవి ఇవ్వాలని ప్రధాని కాళ్లు మొక్కుతారని, బయటకు వచ్చి మాత్రం తాను ప్రత్యేక ప్యాకేజీ అడిగానని చెప్పుకుంటారన్నారు. చంద్రబాబు కూడా ప్రత్యేక హోదా కోసం చిత్తశుద్ధితో కృషి చేయడం లేదన్నారు. కృష్ణా, గోదావరి జలాల వివాదాన్ని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సామరస్య ధోరణితో పరిష్కరించుకోకపోగా ప్రజలను రెచ్చగొడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు, కెసిఆర్‌కు 23 జిల్లాలపై అవగాహన ఉందని, వారు గంట కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. తమ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే ఇద్దరు ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తున్నారని వీరి మధ్య ఒక అవగాహనతో కూడుకున్న గుద్దులాట, ముద్దులాట సాగుతోందని విమర్శించారు. ఇక ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్‌గా ఉన్న నరసింహన్ తెలంగాణకు వెళ్లి ఆ ముఖ్యమంత్రి కెసిఆర్‌కు అనుకూలంగా, ఆంధ్రాకు వచ్చినప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా మాట్లాడుతూ కాలం గడిపేస్తున్నారని విమర్శించారు. బాబు, కెసిఆర్‌లు ఇద్దరూ రాజకీయ అవినీతికి పాల్పడుతున్నారన్న నారాయణ, తానీ విషయాన్ని నిరూపిస్తానని సవాల్ చేశారు. ఇక చట్టంలో ఫిరాయింపులు ఉండకూడదని స్పష్టంగా ఉన్న ఇరు రాష్ట్రాల సిఎంలు వాటిని తుంగలో తొక్కుతున్నారన్నారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదన్నారు.