ఆంధ్రప్రదేశ్‌

మంచివారి వౌనం మంచిది కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 5: చెడ్డవారు నోటికొచ్చినట్టు అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు మంచివారు మాట్లాడకపోవడం విషాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆదివారం ప్రజాప్రతినిధులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో మాట్లాడిన చంద్రబాబు ప్రభుత్వం పాజిటివ్‌గా వెళుతుంటే ప్రతిపక్షం ప్రతికూల ఆలోచనలతో వెళుతోందని, అందుకే ప్రజల విశ్వాసానికి దూరమైందన్నారు. ప్రభుత్వం చేపట్టిన ప్రతి పవిత్రమైన కార్యక్రమాన్ని చెడగొట్టటమే ప్రతిపక్షం ఒక పనిగా పెట్టుకుందని విమర్శించారు. ‘రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని చెడగొట్టాలనుకుంది.. విశాఖలో నిర్వహించిన ఫ్లీట్ రివ్యూని పాడుచేయాలని భావించింది. తునిలో విధ్వంసకాండ సృష్టించింది’.. అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నవ నిర్మాణ దీక్షలు, మహా సంకల్ప కార్యక్రమాలను దెబ్బతీసేందుకు అనంతరపురంలో యాత్రల పేరుతో జగన్ దుర్భాషలాడుతున్నాడని చంద్రబాబు అన్నారు. చెడ్డవారు గొంతు పెద్దగా వినిపించినప్పుడు మంచివారు వౌనం వహించడం దుష్పరిణామాలకు దారితీస్తుందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజల్లో ప్రచారం చేయాలని ఆయన ప్రజాప్రతినిధులకు దిశానిర్దేశం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాల గురించి మరింతగా ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగానిదేనని చెప్పారు. ప్రతి రంగంలో నాయకత్వం ప్రతిభావంతంగా ఉండాలని, నాయకత్వం బాగుంటేనే మెరుగైన ప్రజాసంబంధాలు ఉంటాయని ఆయన చెప్పారు.