తెలంగాణ

రేవంత్‌రెడ్డిపై కేసు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళి విద్యార్థుల సభలో ప్రసంగించిన టి.టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్ రెడ్డితో పాటు మరి కొందరు నాయకులపై, విద్యార్థి సంఘాల నాయకులపై ఉస్మానియా వర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. వర్సిటీలో రాజకీయ నాయకులు సభలు, సమావేశాలు నిర్వహించి విద్యార్థులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ఒక విద్యార్థి కోర్టును ఆశ్రయించడంతో, స్పందించిన కోర్టు నాయకులెవ్వరూ హాజరుకావద్దని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా గురువారం రేవంత్ రెడ్డి బైక్‌పై యూనివర్సిటీకి వెళ్ళి, విద్యార్థులనుద్ధేశించి ప్రసంగించి వెళ్ళారు. రేవంత్ రెడ్డితో పాటు బిజెపి మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, తెలంగాణ ఉద్యమ వేదిక, బిసి విద్యార్థి సంఘం, ఓయు జెఎసిలకు చెందిన నాయకులు చెరుకు సుధాకర్, కళ్యాణ్, డి. భాస్కర్, కె. ఆంజనేయులు, బి. లక్ష్మి, బాబు లాల్ నాయక్, ఎల్లన్న తదితదరులపై పోలీసులు ఐపిసి 290, 188, 21/76 సిపి చట్టం కింద (క్రైం నెంబర్ 247/16) కేసు నమోదు చేశారు.

బసంతనగర్ పోలీసుల
అదుపులో నైజీరియన్ ముఠా?

రామగుండం, జూన్ 3: ప్రైజ్ మనీ పేరుతో లక్షల రూపాయలు టోకరా వేసిన నైజీరియన్ ముఠా కరీంనగర్ జిల్లా రామగుండం మండలం బసంతనగర్ పోలీసులకు చిక్కిన్నట్లు తెలిసింది. కమాన్‌పూర్ మండలం కన్నాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి 1.40 కోట్ల రూపాయల ప్రైజ్ మనీ వచ్చిందంటూ సెల్ ఫోన్‌కు మెసేజ్ పంపగా అది నమ్మిన సదరు వ్యక్తి విడతల వారిగా 24 లక్షల రూపాయల నైజీరియన్ ముఠా అకౌంట్‌లోకి జమ చేయగా... ప్రైజ్ మనీ ఎంతకీ రాకపోవడంతో మోసపోయానని గమనించిన బాధితుడు బసంతనగర్ పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు ముఠా కాల్ డేటా ఆధారంగా దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి అక్కడ కూపీ లాగడంతో ముఠా సభ్యులు పట్టుబడ్డట్లు సమాచారం. పెద్దపల్లి సిఐ, బసంత నగర్ ఎస్‌ఐ ఢిల్లీ వెళ్లి ముఠా సభ్యుల వివరాలను ఆరా తీయగా ఇద్దరు నైజీరియన్లు, ఒక నార్త్ ఇండియన్ వ్యక్తిని బసంతనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని ఇక్కడికి తీసుకవస్తున్నట్లు సమాచారం. నిందితుల వివరాలు తెలియాల్సి ఉంది.

దొంగ దీక్షలు
కాంగ్రెస్ నైజం

టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్ ధ్వజం

హైదరాబాద్, జూన్ 3: కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్‌రెడ్డి అధికారంలో లేమనే అసహనంతో మాట్లాడుతున్నారని టిఆర్‌ఎస్ ఎంపి బాల్కసుమన్ విమర్శించారు. టిఆర్‌ఎస్ ఎల్‌పి కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రిగా కెసిఆర్ పనితీరును దేశమంతా అభినందిస్తుంటే జైపాల్‌రెడ్డి మాత్రం అసహనంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. కెసిఆర్ దీక్షతోనే అప్పటి ప్రభుత్వం హడిలిపోయి తెలంగాణ ఏర్పాటు కోసం ప్రకటన చేసిందని, అలాంటి దీక్షపై జైపాల్‌రెడ్డి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం తగదని అన్నారు. దొంగ దీక్షలు, దొంగ రాజకీయాలు, దొంగ నాటకాలు కాంగ్రెస్‌కు అలవాటని అన్నారు. తెలంగాణ ఉద్యమానికి దూరమైన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు దూరమయ్యారని ప్రజల నుంచి చీత్కారాలు ఎదురైన ప్రతిసారి కాంగ్రెస్ నాయకులు దొంగ దీక్షలతో ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించారని విమర్శించారు. ప్రతి ఎన్నికల్లోనూ టిఆర్‌ఎస్ ఘన విజయం సాధిస్తోందని, ప్రభుత్వ పాలనపై ఇవి ప్రజలు ఇస్తున్న తీర్పులని అన్నారు. అధికారం లేక అసహనంతో ఉన్న కాంగ్రెస్ నాయకులు కెసిఆర్‌పై విషం కక్కుతున్నారని, చివరకు జర్నలిస్టులపై కూడా దాడులకు దిగుతున్నారని బాల్కసుమన్ విమర్శించారు.
జైపాల్‌రెడ్డి తెలంగాణను మోసం చేసిన చరిత్ర హీనుడని విమర్శించారు. ఎన్నికల హామీలు అమలు చేయలేదని కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి వెళ్లి చెబితే ప్రజలు తిరగబడతారని, అందుకే వాళ్లు గాంధీ భవన్‌కు పరిమితం అయ్యారని ఎద్దెవా చేశారు.

‘ ఫిరాయింపులపై
న్యాయ పోరాటం’

హైదరాబాద్, జూన్ 3: ఆకర్ష్ పథకం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి ఇతర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను తనలో చేర్చుకుంటూ ఫిరాయింపులను ప్రోత్సహించడంపై న్యాయ పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, తెలంగాణ శాసనమండలి (కౌన్సిల్)లో ప్రతిపక్ష నేత మహ్మద్ షబ్బీర్ అలీ తెలిపారు. ఇతర పార్టీల నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, పలువురు ఎంపీలను చేర్చుకున్నారని ఆయన శుక్రవారం విలేఖరులతో మాట్లాడుతూ చెప్పారు. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఆయన విమర్శించారు. 2019 సంవత్సరంలోగా కోటి ఎకరాలకు నీరు ఇస్తామని తొలుత చెప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తాజాగా మాట మార్చి 2022 నాటికి పూర్తి చేస్తామని అంటున్నారని ఆయన తెలిపారు. ఈ లెక్కన ఇచ్చిన హామీలు పూర్తి చేయగలమో లేదోనన్న అనుమానంతో 2017 సంవత్సరంలోనే సార్వత్రిక ఎన్నికలకు వెళ్ళే అవకాశం లేకపోలేదని అన్నారు.