తెలంగాణ

కరీంనగర్ జిల్లాలో గాలి వాన బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, జూన్ 3: గాలి వాన బీభత్సం సృష్టించింది. జిల్లాలోని పలుచోట్ల శుక్రవారం సాయంత్రం భారీ ఈదులుగాలులు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలి తీవ్ర స్థాయిలో వీచడంతో పలుచోట్ల పాత ఇండ్లు, రేకుల షేడ్లు కూలిపోగా, చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. ఫలితంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గాలి దుమారానికి వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన కత్తి శంకరయ్య (47) అనే గీతా కార్మికుడు తాటి చెట్టుపై నుండి పడి మృతి చెందాడు. ఎల్కతుర్తి మండలం సూరారంలో ఇంటి రేకులు కూలి ఇద్దరు చిన్నారులు మేకల సుజన (12), మేకల ప్రణవి (12) గాయపడ్డారు. ఈదురుగాలులకు దండేపల్లి వద్ద రైల్వే విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో సిర్పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు గంటలు నిలిచిపోగా, ప్రయాణీకులు ఇబ్బందులుపడ్డారు.
జిల్లా కేంద్రమైన కరీంనగర్‌తోపాటు హుజురాబాద్, పెద్దపల్లి, ధర్మారం, చొప్పదండి, బెజ్జంకి, సుల్తానాబాద్, ఎల్కతుర్తి, వీణవంక, ఓదెల తదితర మండలాల్లో ఈదురు గాలులతో వర్షం పడింది. కరీంనగర్‌లో భారీ ఈదురుగాలులతో వర్షం కురువగా, పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంబాలు పడిపోయాయి. ఫలితంగా విద్యుత్ నిలిచిపోయి నగరంలో చిమ్మచీకట్లు అలుముకున్నాయి. జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్, ఎమ్మెల్యే కమలాకర్ చెట్లు, విద్యుత్ స్తంభాలు పడిపోయిన ప్రాంతాలను సందర్శించి పరిశీలించారు.
మొత్తానికి గాలి వాన బీభత్సం సృష్టించగా, కొంతమేర వాతావరణం చల్లబడింది.