ఆంధ్రప్రదేశ్‌

ఆమె చనిపోతూ.. 8 మందికి ఊపిరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూన్ 3: తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మను ప్రసాదించింది ఆ మాతృమూర్తి. మూడు పదులు నిండని వయసులో మరణానికి చేరువవుతూ అవయవదానం చేయడం ద్వారా మరణానికి చేరువలో ఉండే అభాగ్యులకు ప్రాణదానం చేసింది. రాష్ట్రంలోనే తొలిసారి ఇతర అవయవాలతో పాటు ఊపిరితిత్తులను సైతం ఈ ప్రక్రియలో సేకరించడం గమనార్హం. ఈ మహత్తర అవయవదాన ప్రక్రియకు కర్త ఆ మాతృమూర్తి కాగా, కర్మ ఆమె చనిపోయిన మరికొందరిలో బతికుంటుందని భావించిన ఆమె భర్త, క్రియకు వేదికగా నెల్లూరులోని బొల్లినేని కిమ్స్ ఆసుపత్రి నిలిచింది. అతి సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చి అసాధారణ నిర్ణయంతో అందరి మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయేలా చేసిన ఈ సంఘటన నెల్లూరులో శుక్రవారం జరిగింది. నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గడ్డం నారాయణమ్మ, వెంకటయ్య దంపతులు. ఈనెల 1న ఉదయం తమ ఇంటి డాబాపై దుస్తులు ఆరవేస్తున్న నారాయణమ్మ(26) ప్రమదావశాత్తూ మేడపై నుంచి కింద పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమెకు మెడ వెనుక భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆమెను నెల్లూరులోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ్నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరులోని బొల్లినేని కిమ్స్ వైద్యశాలకు ఆమెను తరలించారు. అప్పటికే కోమాలోకి వెళ్లిన నారాయణమ్మకు ఆధునిక చికిత్స అందించినా పరిస్థితి విషమించడంతో ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు గురువారం సాయంత్రం నిర్ధారించారు. ఆమె అవయవాలను అవసరమైన వారికి అందించడం ద్వారా మరికొంతమందికి పునర్జన్మ అందించడంతో పాటు చనిపోయిన తమ వారు ఇంకా ఇతరుల ప్రాణాల్లో సజీవంగా ఉండేటట్లు చేయవచ్చంటూ ఆమె భర్త వెంకటయ్యతో పాటు రక్తసంబంధీకులను కిమ్స్ వైద్యులు ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు ఆమె భర్త, తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో వెంటనే ఆమె అవయవాలను సేకరించాలని నిర్ణయించి, జీవన్‌దాన్ ట్రస్ట్ ద్వారా అవసరమైన ఆసుపత్రులకు వాటిని చేరవేసేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం 12 గంటలకు శస్తచ్రికిత్స ప్రారంభించి ఆమె శరీరంనుంచి అవయవాలను భద్రంగా సేకరించారు. ఊపిరితిత్తులు, గుండెను చెన్నైలోని పోర్టిస్ ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా క్షణాల్లో చేరవేశారు. కాలేయాన్ని విజయవాడలోని మణిపాల్ ఆసుపత్రికి, కిడ్నీలను నెల్లూరులోని నారాయణ, బొల్లినేని ఆసుపత్రులకు, కళ్లను మోడరన్ కంటి ఆసుపత్రికి అందచేశారు. కిమ్స్ ఆసుపత్రికి చెందిన అవయవ మార్పిడి నిపుణులు డాక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి, దీపికలతో పాటు, కిమ్స్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ గిరినాయుడు, ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రంగారావు ఈ అవయవదానంకు నారాయణమ్మ కుటుంబీకులను ఒప్పించడం మొదలు అవయవాలను భద్రంగా అవసరమైన చోటికి చేర్చే వరకూ విశేష కృషి చేశారు.
బ్రెయిన్ డెత్‌కు గురైన వ్యక్తి నుంచి ఎనిమిది కీలకమైన అవయవాలను సేకరించడం రాష్ట్రంలోనే తొలిసారి నెల్లూరులోని బొల్లినేని కిమ్స్ ఆసుపత్రిలో చేపట్టామని ఆసుపత్రి ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ టి.గిరినాయుడు పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రమదావశాత్తూ గాయపడి తమ ఆసుపత్రిలో చేరి బ్రెయిన్ డెత్‌కు గురైన నారాయణమ్మ అనే మహిళ అవయవాలను ఆమె భర్త, కుటుంబసభ్యుల అంగీకారం మేరకు ఆమె నుంచి ఊపిరితిత్తులు, గుండె, కిడ్నీ, కళ్లు సేకరించి అవసరమైన వారికి అమర్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. గతంలో ఎన్నడూ ఊపిరితిత్తులను రాష్ట్రంలో సేకరించలేదన్నారు. తమ ఆసుపత్రికి చెందిన డాక్టర్ శ్రీ్ధర్‌రెడ్డి, దీపిక సహకారంతో తొలిసారి ఊపిరితిత్తులను కూడా సేకరించి చెన్నై ఆసుపత్రికి హెలికాప్టర్ ద్వారా సకాలంలో పంపించి వేరొక రోగికి విజయవంతంగా అమర్చగలిగేలా చేయలిగామన్నారు.