ఆంధ్రప్రదేశ్‌

కష్టపడుతున్న ననే్న చెప్పులతో కొట్టమంటాడా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 3: రోజుకు 18 గంటలు కష్టపతున్న తనను చెప్పులతో కొట్టమని చెప్పే ప్రతిపక్ష నాయకుడు ఉండడం మన దురదృష్టమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. అనంతపురం జిల్లాలో జగన్ పర్యటిస్తూ చేసిన వ్యాఖ్యలపై సిఎం తీవ్రంగా స్పందించారు. నగరంలో జరిగిన నవనిర్మాణ దీక్ష రెండో రోజు కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు జగన్‌పై విరుచుకుపడ్డారు. జగన్ 200 రోజులు తిరిగినా, రెండు సీట్లు కూడా ప్రతిపక్షానికి వచ్చే అవకాశమే లేదని అన్నారు. చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదని అన్నారు. కొంతమంది డబ్బులు సంపాదించినా ఆనందంగా ఉండరని, జైలుకు వెళ్లినా బుద్ధి రావడం లేదని జగన్ ఉద్దేశించి అన్నారు. ప్రతిపక్ష నేత ఒక విచిత్రమైన వ్యక్తి అని, తనను రాళ్ళతో కొట్టమంటూ, నీచంగా మాట్లాడుతున్నాడని ఆయన అన్నారు. తను ప్రతిపక్షంలో ఉండగా, పెద్ద పెద్ద నాయకులతో పోరాటం చేశానని, ఇప్పుడు ఒక నేరస్తునితో మాటలు పడాల్సి వస్తోందని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం తను మాట్లు పడడానికైనా సిద్ధంగా ఉన్నానని సిఎం అన్నారు. నాకు భయం అంటే తెలియదు. నేను ఎవ్వరికీ భయపడనని సిఎం అన్నారు. రాజశేఖరరెడ్డి సిఎంగా ఉన్నప్పుడు 25 సార్లు తనపై విచారణలు జరిపించినప్పటికీ, నిర్దోషిగా బయటపడ్డానని, తాను నిప్పులా బతికానని అన్నారు. రౌడీలు, నేర చరిత కలిగిన వారు రాష్ట్రంలో ఉంటే, పెట్టుబడులు పెట్టడానికి ఎవ్వరూ ముందుకు రారని సిఎం అన్నారు. కాపు ఉద్యమం పేరుతో రైళ్ళను తగలబెట్టారని, రైళ్లు వారిని ఏం చేశాయని ఆయన ప్రశ్నించారు. తప్పుడు మనుషులకు తాను దూరంగా ఉంటానని చంద్రబాబు చెప్పారు. అనంతరపురంలో జగన్ సభలు పెడితే, జనం ఆయన వెంట వెళతారనుకోవడం అవివేవకమని అన్నారు. అనంతపురం టిడిపికి కంచుకోట అని అన్నారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు న్యాయం చేయమని అడిగితే అప్పటి కేంద్ర పెద్దలు తనను హేళన చేశారని చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. విభజన గాయం మానుతున్నా, మన కష్టాలు మాత్రం తీరలేదని సిఎం అన్నారు. హైదరాబాద్ వంటి నగరాన్ని నిర్మించాలంటే కనీసం ఐదు లక్షల కోట్ల రూపాయల వ్యయం అవుతుందని, 20 సంవత్సరాల సమయం పడుతుందని అన్నారు. రాష్ట్రానికి రైల్వే జోన్ రాలేదు. ఉత్తరాంద్ర, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం ఇచ్చింది 700 కోట్లు మాత్రమేనని అన్నారు. పోలవరం నిర్మాణానికి 850 కోట్లు మాత్రమేనని అన్నారు.
నవ నిర్మాణ దీక్షపై సిఎం టెలికాన్ఫరెన్స్
చరిత్రలో ఒక మలుపులో ఉన్నాం. నిర్లక్ష్యం చేస్తే వెనక్కు వెళ్లిపోతాం. పట్టుబట్టి ముందుకు వెళితే అద్భుత ఫలితాలు సాధిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ముఖ్యమంత్రి తన నివాసం నుంచి సుమారు 5,600 మంది అధికారులు, ప్రజా ప్రతినిధులు, సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. విభజన వలన కలిగిన నష్టాన్ని కష్టంతో అధిగమించాలని, రాష్ట్రాన్ని విడదీసిన వాళ్లే విస్తుపోయేలా అభివృద్ధి సాధించాలని అన్నారు. విభజన అసమానంగా జరిగిందంటూ, ఆదాయం 47 శాతం, జనాభా 58 శాతం రావడంతో మొదటి రెండేళ్లు ఆర్థికంగా అనేక కష్టాలు ఎదుర్కొన్నామని ముఖ్యమంత్రి వివరించారు. తొలి ఏడాదిలో 16 వేల కోట్ల రెవెన్యూ లోటు వస్తే కేంద్రం 2,300 కోట్లు మాత్రమే ఇచ్చిందని చెప్పారు.