ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభకు అంతా ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 3: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుండి ఆరుగురు రాజ్యసభ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయింది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత పోటీలో ఎవరూ లేకపోవడంతో ఆరుగురూ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఆంధ్రాలో నాలుగు స్థానాలకు జరిగిన ఎన్నికల్లో బిజెపి నుండి సురేష్‌ప్రభు, టిడిపి నుండి సుజనా చౌదరి, టిజి వెంకటేష్, వైకాపా నుండి విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. విజయసాయి రెడ్డి మినహా మిగిలిన వారికి ఎన్నికైనట్టు పేర్కొంటూ ధ్రువపత్రాలను అందజేశారు. విజయసాయిరెడ్డి ఈ నెల 6న తన ఎన్నిక ధ్రువపత్రాన్ని స్వీకరించనున్నారు.
తెలంగాణనుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు ధర్మపురి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులు ఇద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రెండు స్థానాలకు ఈ ఇద్దరు మాత్రమే నామినేషన్లు దాఖలు చేయడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం అయింది. అసెంబ్లీ కార్యదర్శి వీరిద్దరికీ శనివారం రాజ్యసభ సభ్యులుగా ధ్రువీకరణ పత్రాలు అందజేశారు. తగినంత సంఖ్యా బలం లేకపోవడం వల్ల పోటీకి దూరంగా ఉన్నట్టు కాంగ్రెస్ ప్రకటించింది. ఇతర పార్టీలకు కనీసం నామినేషన్ దాఖలు చేయడానికి అవసరమైన పదిమంది శాసన సభ్యుల మద్దతు కూడా లేదు. దీంతో ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది.
ఏపి అభివృద్ధికి సహకరిస్తా: సురేష్ ప్రభు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను సమన్వయం చేసుకుని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా రైల్వే మంత్రి సురేష్ ప్రభు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుండి బిజెపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ తనకు మద్దతు ఇచ్చిన తెలుగు దేశం పార్టీకి కృతజ్ఞతలు తెలిపారు. ఎపి నుండి తాను ఎన్నిక కావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సురేష్‌ప్రభు చంద్రబాబును పొగడ్తలతో ముంచెత్తారు. బాబు వంటి నేత రాష్ట్రానికి సిఎంగా ఉండటం ఎంతో అదృష్టమన్నారు. ఆయన హయాంలో దేశంలోనే మంచి గుర్తింపు తెచ్చుకునే రాష్ట్రంగా ఎపి ఎదుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని అన్నారు. ముందుగా తాను శనివారం తిరుమల వెళ్లి శ్రీవారి ఆశీర్వాదం తీసుకుంటానని, ఆ తర్వాత చంద్రబాబుతో సమావేశం అవుతానని సురేష్ ప్రభు చెప్పారు. విజయవాడలో రైల్వే అధికారులతో కూడా తాను చర్చిస్తానని, రాబోయే కృష్ణా పుష్కరాల ఏర్పాట్లపై కూడా చర్చిస్తానని చెప్పారు.
ప్రత్యేక హోదాకు కృషి : సుజనా చౌదరి
రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఇతర హామీల అమలుకు తాను పట్టుదలతో కృషి చేస్తానని సుజనా చౌదరి స్పష్టం చేశారు. తనకు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు టిజి వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు. వివిధ రాష్ట్రాల్లో తెలుగు వారు ఎదుర్కొంటున్న సమస్యలను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు.
ఘన స్వాగతం
ఏపినుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన నలుగురు సభ్యుల్లో ముగ్గురికి శుక్రవారం నాడు శాసనసభ ప్రాంగణంలో ఘనస్వాగతం లభించింది. ముగ్గురికి మండలి చైర్మన్ చక్రపాణి ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.
chitram...
రాజ్యసభ కు ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని కేంద్రమంత్రి సురేష్ ప్రభుకు అందజేస్తున్న ఏపి అసెంబ్లీ కార్యదర్శి.
తెలంగాణ నుంచి పెద్దల సభకు ఎన్నికైనట్లు ధ్రువపత్రాన్ని అసెంబ్లీ కార్యదర్శినుంచి అందుకుంటున్న కెప్టెన్, డిఎస్