ఆంధ్రప్రదేశ్‌

ప్రజాసేవే నాకు ఆక్సిజన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనిలోనే ఆనందం రాష్ట్ర విభజనలో దగా పడ్డాం
కాంగ్రెస్, కెసిఆర్, జగన్ కుట్రవల్లే జరిగింది
ఉద్యోగులు తరలిరావల్సిందే..రాజీ లేదు లోకేష్‌ను కేబినెట్‌లో తీసుకుంటే తప్పేమిటి?
కేంద్రం నుంచి బయటికి వస్తే లాభమేమిటి? రాష్ట్ర ప్రయోజనాలే నాకు ముఖ్యం
అందుకే బిజెపికి ఓ ఎంపీ సీటు ఇచ్చాం ఆర్థిక వెనుకబాటు ఆధారంగానే రిజర్వేషన్లు
సకాలంలో పోలవరం సాధిస్తాం కేంద్రంపై వత్తిడి తెస్తున్నాం
రాజధానికి పెట్టుబడులు ముఖ్యం అందుకే దేశాలు తిరుగుతున్నా
ఆర్థిక నేరగాళ్లు, క్రిమినల్స్ నన్ను విమర్శిస్తున్నారు కొత్త జిల్లాల తలనొప్పులెందుకు...
ఆంధ్రభూమి ఇంటర్వ్యూలో సిఎం చంద్రబాబునాయుడు

ఏటికి ఎదురీదైనా నవ్యాంధ్ర కల సాకారం చేసుకోవాలన్న పట్టుదల ముఖ్యమంత్రి చంద్రబాబులో కనిపించింది. తనవి మాటలు కావు చేతలేనన్న బలమైన సందేశాన్నీ ఆయన వినిపించారు. పనిలోనే తనకు ఆనందమన్న బాబు తనతో పాటు ప్రతి ఒక్కరూ కలిసిరావాలన్నారు. ఇక్కడ ప్రజలు కష్టాల్లో ఉంటే..వచ్చేందుకు ఏమిటి ఇబ్బందంటూ సిబ్బందికి చురకలు వేశారు. ఆరునూరైనా నిర్ణీత కాల వ్యవధిలో రావాల్సిందేనని హుకుం జారీ చేశారు. ఏ పార్టీ చేయనంత మేలును కార్యకర్తలకు చేశామన్నారు. రహదారుల వేసినంత మాత్రాన సరిపోదని, రాజధానికి పెట్టుబడులే కీలకమన్నారు. విదేశాలకు విమానాల్లో కాకుండా నడిచివెళ్లాలా అంటూ విమర్శకులపై విరుచుకు పడ్డారు. టెక్నాలజీతో పని సులభమైందని, ఎలాంటి నిర్మాణాలనైనా అతితక్కువ వ్యవధిలోనే కట్టేయవచ్చునన్నారు. పోలవరాన్ని నిర్ణీత కాల వ్యవధిలోనే ప్రారంభించగలమన్న ధీమా వ్యక్తం చేశారు. హోదాకంటే రాష్ట్రానికి నిధులు రాబట్టుకోవడమే ముఖ్యమన్నారు. అందుకే బిజెపికి ఓ ఎంపీ సీటును కూడా ఇచ్చామని చెప్పారు. కేంద్రంతో సఖ్యతతోనే అభివృద్ధి సాధ్యమన్న బాబు విభజనతో పూర్తిగా నష్టపోయామంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్, జగన్, కెసిఆర్ కుట్రవల్లే ఇదంతా జరిగిందన్నారు. తెలంగాణతో ఘర్షణ కోరుకోవడం లేదన్న సిఎం బోర్డే నీటి సమస్యలు పరిష్కరించాలన్నారు. పార్టీ కోసం కష్టపడుతున్న నారా లోకేష్‌ను మంత్రిగా ఎందుకు చూడకూడదన్నారు. తనది పేదకులమని పేర్కొన్న ఆయన ఆర్థికంగా వెనుకబడిన వారికి బాసటగా నిలుస్తున్నామన్నారు. ఆర్థిక ఉగ్రవాదులు, నేరగాళ్లు, ముద్దాయిలుగా ఉన్నవాళ్లూ తనను విమర్శిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా రెండేళ్ల పాలన పూర్తి చేసుకున్న చంద్రబాబు తన మనోభావాలు, భిన్న అంశాలపై అభిప్రాయాలను ఆంధ్రభూమి ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

లోకేష్‌కు మంత్రి పదవి ఇస్తే తప్పేముంది? అతను పార్టీ జనరల్ సెక్రటరీగా బాగా పనిచేస్తున్నాడు. కార్యకర్తల సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడు. బాగా తిరుగుతూ, పార్టీని అభివృద్ధి చేస్తున్నాడు. ఆ సమయం వచ్చినప్పుడు అది జరుగుతుంది.

ఉద్యోగులంతా రావలసిందే. దీనిపై నేను సీరియస్‌గా ఉన్నా. రాకపోతే ఊరుకోను. ఇకపై చర్చల్లేవు. సిఎస్ చెప్పినా వినను. ఉద్యోగులకంటే ఇక్కడి ప్రజలే ఎక్కువ కష్టాల్లో ఉన్నారు. ఈ విషయంలో ననె్నవరూ శాసించలేరు.