ఆంధ్రప్రదేశ్‌

మేం రాము బాబో!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 3:సచివాలయ ఉద్యోగులంతా జూన్ 27నాటికల్లా తరలిరావాలంటూ సిఎం చంద్రబాబు ఇచ్చిన పిలుపు ఫలించేలా కనిపించడం లేదు. జూన్ 27 నాటికి మూడు వేల మంది ఉద్యోగులు తరలి వస్తారని ముఖ్యమంత్రి, మంత్రులు గత కొంతకాలంగా చెబుతూ వస్తున్నారు. సౌకర్యాలు లేకపోయినా ఉద్యోగులంతా తరలి వస్తారని ఉద్యోగ సంఘ నేతలు సైతం పదే పదే వల్లె వేశారు. ఈ విషయంలో ఇప్పటివరకూ నోరు మెదపని సెక్రటే9రియట్ ఉద్యోగులు గడచిన రెండు రోజుల నుంచి గళం విప్పుతున్నారు. అమరావతిలో సౌకర్యాలు లేవంటూ అసంతృప్తి గొంతు విప్పారు. మహిళా ఉద్యోగులంతా గురువారం బిజెపి నాయకురాలు పురంధ్రీశ్వరిని కలిసి తమ గోడు వినిపించుకున్నారు. శుక్రవారం సెక్రటేరియట్ ఉద్యోగులు విడిగా సమావేశమై తమ ఇబ్బందులను చీఫ్ సెక్రటరీ టక్కర్‌కు చెప్పుకున్నారు. స్థానిక అంశాన్ని తేల్చమన్నారు. 30 శాతం డిఎ గురించి పట్టుపడుతున్నారు. అన్నింటికీ మించి ఉద్యోగుల తరలింపునకు సంబంధించి రోడ్ మ్యాప్ ఇమ్మన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని డిమాండ్లను పరిష్కరించడానికి టక్కర్ అంగీకరించారు.
కానీ, ముఖ్యమంత్రి, మంత్రులు చెబుతున్నట్టు మొదటి విడత మూడు వేల మంది ఉద్యోగులు వచ్చే అవకాశం లేదు. కేవలం 300 నుంచి 400 మంది మాత్రమే ఇక్కడికి వచ్చే అవకాశం ఉందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు అంటున్నారు. వెలగపూడి వద్ద నిర్మిస్తున్న తాత్కాలిక సెక్రటేరియట్ ఈ నెల 27 తేదీ నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తయ్యే అవకాశం లేదు. రేయింబవళ్లు కష్టపడి పనిచేసినా, రెండు బ్లాకులను అంతంతమాత్రంగానే పూర్తి చేయగలుగుతారు. సెక్రటేరియట్‌లో ప్రస్తుతం ఏసిలు ఉండవు. ఫ్యాన్‌ల కిందే ఉద్యోగులు పనిచేయాలి. అలాగే ఇప్పుడున్న సెక్రటేరియట్ నుంచి తీసుకువచ్చే ఫర్నీచర్‌తోనే సర్దుకుపోవాలి.
ఇటువంటి పరిస్థితుల్లో పనిచేయడానికి ఉద్యోగులు అంగీకరించడం లేదు. సెక్రటేరియట్ మాట ఎలా ఉన్నా, తాము ఉండటానికి ఇళ్లు కూడా దొరకని పరిస్థితి ఉంది. భారీగా పెరిగిన అద్దెలను చెల్లించలేమని వారు అంటున్నారు. ఇక్కడో ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటే.. ఉద్యోగ సంఘ ప్రతినిధులు ప్రభుత్వానికి ఓ సూచన కూడా చేశారు. విజయవాడ, అమరావతి ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించిన భవనాలను, ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకుని, వాటిని ఉద్యోగులకు ఇవ్వాలన్నది ఆ సూచన.