ఆంధ్రప్రదేశ్‌

అరెస్టులకు భయపడను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 2: ప్రభుత్వంలోని కాపు సామాజికవర్గానికి చెందిన కొందరు పెద్దలతో చేయిస్తున్న విమర్శలు, అరెస్టులు జరుగుతాయనే బెదిరింపులకు భయపడి తమ ఉద్యమాన్ని విరమించేది లేదని కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. కాపులను బిసిల్లో చేరుస్తానని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే హామీ ఇచ్చినందున, దాన్ని నెరవేరుస్తారో, మళ్లీ రోడ్డెక్కమంటారో ఆయనపైనే ఆధారపడివుందన్నారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో బిజెపి రాష్ట్ర నాయకుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణ, వైసిపి రాష్ట్ర నేతలు జక్కంపూడి విజయలక్ష్మి, జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావును గురువారం ముద్రగడ పద్మనాభం కలుసుకున్నారు. తాను ఉద్యమించిన సమయంలో మద్దతు తెలిపినందుకు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈసందర్భంగా ముద్రగడ విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి తమకు ఇచ్చిన హామీలకు ఆగస్టు నెలాఖరు వరకూ గడువుందని, ఆ గడువులోగా హామీలు నెరవేరకపోతే మళ్లీ ఆందోళనకు సిద్ధమేనని ప్రకటించారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను ఆలస్యం లేకుండా అమలుచేస్తారని ముద్రగడ ఆశాభావం వ్యక్తంచేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి చంద్రబాబే తమ ఉద్యమానికి స్ఫూర్తినిచ్చారన్నారు. తరతరాలుగా కాపులు పేదరికంతో అణగారిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రిజర్వేషన్లు కల్పిస్తామని సిఎం హామీ ఇచ్చి ఉండకపోతే తాము రోడ్కెక్కేవాళ్లం కాదన్నారు. ఎపి కంటే ఆలస్యంగా ఉద్యమంచేసిన రాజస్థాన్, హర్యానాల్లో రిజర్వేషన్ ఫలాలు అందాయన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఆలస్యం చేయకుండా సత్వరమే అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంటుకు పంపించాలని కోరారు. ఈ మేరకే బిజెపిలోని సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ వంటి కాపు సామాజిక నేతలను కూడా కలిసి, భవిష్యత్తులో కూడా సహకరించాలని కోరుతున్నామని ముద్రగడ పేర్కొన్నారు. కాగా ప్రభుత్వం చెప్పింది చేస్తుందని మిత్రపక్షంగా ఆశిస్తున్నామని ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.