ఆంధ్రప్రదేశ్‌

ప్రతి స్కూలూ దేవాలయం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూన్ 1: ప్రతి పాఠశాల ప్రార్థనాలయం కావాలని, పుట్టుకతో ఏదీ సాధ్యం కాదని, సాధనతో ఏదైనా సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. బుధవారం విజయవాడలో డిఎస్సీ 2014 ద్వారా నూతనంగా ఎంపికైన ఉపాధ్యాయులకు నియామక ఉత్తర్వులు అందజేసి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ నాలెడ్జ్ రాష్ట్రంగా అభివృద్ధి చెందాలని, అది టీచర్ల ద్వారానే సాధ్యమవుతుందన్నారు. ఉపాధ్యాయులకు క్రమశిక్షణ అవసరమని, తన జీవితంలో గుర్తుపెట్టుకునే వారిలో ఉపాధ్యాయులు ముందుంటారని పేర్కొన్నారు. ఎడ్యుకేషన్ హబ్‌గా చేయాలనే ధృఢ సంకల్పంతో పనిచేస్తున్నానని, తల్లిదండ్రులు తమ పిల్లలకు ఎంత డబ్బు, ఆస్తి ఇస్తారన్నది ముఖ్యం కాదని, ఎంతవరకు చదివించారన్నదే ముఖ్యమన్నారు. విద్యాశాఖలో జూన్ 1న ఒక చరిత్ర సృష్టించిందని, నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అధికారుల చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా అందరికీ ఒకే చోట నియామక ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్య నాగరికతకు మూలమని, ఆడపిల్లలు బాగా చదువుతున్నారని ప్రశంసించారు. ప్రపంచంలో ఎక్కడాలేని యువత భారతదేశంలో ఉన్నారని, ప్రపంచాన్ని జయించే శక్తి భారతదేశానికి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోచదివే పిల్లలకు తెలివితేటలు, పట్టుదల ఉంటాయని, అయినప్పటికీ ప్రైవేటుతో పోల్చుకుంటే ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఫలితాలు ఎక్కువగా రావడం లేదని లోపం ఎక్కడో జరుగుతోందన్నారు. ఆడపిల్లలకు 9వ తరగతిలో సైకిళ్లు ఇచ్చేలా కేబినెట్‌లో ఆమోదించడం జరిగిందని, వినూత్నమైన పద్ధతుల్లో బోధన చేయడానికి ప్రతి ఒక్కరూ సిద్ధం కావాలన్నారు. వారి జీవితంలో ఈ రోజు మరపురాని రోజు కావాలన్నారు. ఉపాధ్యాయులకు స్వేచ్ఛను ఇస్తామని, పిల్లలు పోటీపడి చేదివేలా తయారు చేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులతో మమేకం కావాలని, ఫిజికల్ లిటరసీ చాలా ముఖ్యమని పేర్కొన్నారు. అన్ని పాఠశాలలను డిజిటల్ క్లాస్ రూమ్స్‌గా తయారు చేస్తామని, ప్రధాన మంత్రి పిలుపునిచ్చిన డిజిటల్ ఇండియా దీని ద్వారా సాధ్యమవుతుందన్నారు. అంతకు ముందు డిఎస్సీ 2014లో ఎంపికైన 8926 మంది ఉపాధ్యాయులకు నియామక పత్రాలను అందజేసి ప్రతిజ్ఞ చేయించారు. స్పీకర్ కోడెల శివప్రసాదరావు, రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కామినేని శ్రీనివాసరావు, కొల్లు రవీంద్ర, పల్లె రఘునాథ రెడ్డి, అచ్చెంనాయుడు, జడ్పీ ఛైర్‌పర్సన్ గద్దె అనూరాధ పాల్గొన్నారు.