తెలంగాణ

ప్రాజెక్టుల వేగానికి భూసేకరణ అడ్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 30: వేగంగా ప్రాజెక్టులు నిర్మించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా, భూ సేకరణ ప్రధాన సమస్యగా మారింది. కోటి ఎకరాలకు సాగునీటిని అందించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 25వేల ఎకరాల భూమిని సేకరించాలి. అయితే పలు గ్రామాల్లో భూ సేకరణ వివాదాస్పదం అవుతోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా భూ సేకరణలో పరిహారం ఎక్కువగా చెల్లిస్తున్నారు.
అయితే కొన్ని ప్రాంతాల్లో భూ సేకరణ సమస్యగా మారుతోంది. దేవాదుల, ప్రాణహిత, డిండి, ఉదయ సముద్రం ఎస్‌ఎల్‌బిసి ప్రాజెక్టుల భూ సేకరణలో తలెత్తిన సమస్యలపై నీటిపారుదల మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆయా జిల్లా కలెక్టర్లకు సూచనలు చేశారు. ఈ అంశంపై సోమవారం సచివాలయంలో నల్లగొండ, మెదక్, వరంగల్, ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో సమావేశం అయ్యారు. ఇరిగేషన్, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. భూ సేకరణలో ఆలస్యం అయితే ప్రాజెక్టు నిర్మాణంపై ఆ ప్రభావం పడుతుందని దీనిని దృష్టిలో పెట్టుకుని ఎక్కడా సమస్యలు రాకుండా చర్యలు తీసుకోవాలని హరీశ్‌రావు కోరారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టు నిర్మాణం కోసం భూ సేకరణ జరిపేందుకు ప్రభుత్వం ప్రయత్నించడం గ్రామాల్లో ఉద్రిక్తతకు దారి తీసింది. 50టిఎంసిలతో మల్లన్న సాగర్‌ను నిర్మించేందుకు భూ సేకరణ జరుపుతున్నారు. ప్రభుత్వం చెల్లించే పరిహారం సరిపోదని పెంచాలని కోరుతూ గత నెల రోజుల నుంచి గ్రామస్తులు ఆందోళన చేస్తున్నారు. సోమవారం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామంలో బాధితులు ప్రభుత్వ అధికారులపై తిరగబడుతున్నారు. ఈ విషయం తెలియగానే ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులు జిల్లా అధికారులను సంప్రదించారు. సామరస్య పూర్వకంగా సమస్య పరిష్కారం అయ్యేట్టు చూడాలని సూచించారు.

సోమవారం హైదరాబాద్‌లో ఇరిగేషన్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి హరీశ్‌రావు