తెలంగాణ

పవన సుతుని కంట కన్నీరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 30: ఆంజనేయ స్వామి విగ్రహం కన్నీరొలికిన సంఘటన ఖమ్మం జిల్లా వైరా మండలంలోని బ్రాహ్మణపల్లిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. బ్రాహ్మణపల్లిలో మూడేళ్ళ క్రితం ఆంజనేయస్వామి ఆలయం నిర్మించారు. ఈ క్రమంలో ఆలయ వార్షికోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా నిర్వహించాలని ఆలయ పూజారి సతీష్‌శర్మ ఆలయ పాలకమండలిలో ఒక సభ్యుడితో చర్చించారు. దీనిపై ఆగ్రహించిన సభ్యుడు పూజారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో గత రెండు రోజులుగా ఆలయం మూసివేశారు. దీంతో దిగివచ్చిన పాలకమండలి సభ్యుడు అందరితో కలసి తిరిగి తన పొరపాటును ఒప్పుకున్నారు. దీనితో అందరి సమక్షంలో పూజారి సోమవారం ఆలయ ద్వారాలు తెరిచారు. ఆ సమయంలో ఆంజనేయ విగ్రహం కంట నీరు కారుతున్న దృశ్యం అందరినీ ఆశ్చర్య పరిచింది. ఈ విషయం జిల్లా అంతటా దావానంలా వ్యాపించింది. దీనితో వివిధ గ్రామాల నుండి భక్తులు తండోప తండాలుగా తరలివచ్చారు. స్థానికులు మాత్రం ఆంజనేయుడు కలతచెందడం వల్లే ఇదంతా జరుగుతోందని వ్యాఖ్యానించారు.