ఆంధ్రప్రదేశ్‌

చుక్కల్లో పప్పులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 29: పప్పు ధాన్యాల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. బహిరంగ మార్కెట్‌లో కందిపప్పు, మినపప్పు ధరలు అమాంతం పెరిగిపోవడంతో జనం హడలెత్తిపోతున్నారు. హోటళ్లు, తినుబండారాల దుకాణదారులు కూడా ధరలు పెంచేశారు. తూర్పు గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున కంది, మినప్పప్పులు బ్లాక్‌మార్కెటీర్లు స్టాక్ చేసినట్టు స్పష్టమవుతోంది. అయినప్పటికీ సదరు గోదాములపై దాడులకు అధికారులు సాహసించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇందుకు కారణం చీకటి ఒప్పందాలేనని చెబుతున్నారు. పప్పు ధాన్యాల ధరలు అనూహ్యంగా పెరిగినప్పుడు ఎంపిక చౌక ధరల దుకాణాల్లో గతంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసేవారు. ఇప్పుడలాంటి పరిస్థితే లేదు. కాకినాడ, రాజమహేంద్రవరం రైతుబజార్లలో మాత్రమే కంటి తుడుపు కౌంటర్లు ఏర్పాటుచేసినట్టు చెబుతున్నా..వినియోగదారులకు నిరాశే ఎదురవుతోంది. ఇటీవలి కాలంలో కిలో కందిపప్పు ధర రూ.165కు చేరినా దాన్ని అతికష్టం మీద అయితే అతికష్టంమీద కిలో రూ.140కు తీసుకొచ్చామని అధికారులు చెబుతున్నారు. చాలాచోట్ల కిలో కందిపప్పు రూ.160కే విక్రయాలు జరుగుతున్నాయి. దేశవాళీ కందిపప్పును హోల్‌సేల్ వర్తకులు కిలో రూ.122కు రిటైల్ వర్తకులకు సరఫరా చేయాలని, రిటైల్ వర్తకులు మాత్రం రూ.125కు మాత్రమే విక్రయించాలన్న ఆదేశాల అమలే జరగడం లేదు.
ఏరకం కందిపప్పునైనా నిర్దేశించిన ఈ ధరలకు మించి అమ్మితే కేసులు నమోదు చేస్తామన్న హెచ్చరికలూ తూతూ మంత్రంగానే మారాయి.