ఆంధ్రప్రదేశ్‌

బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 27: బ్రాహ్మణ విద్యార్థులకు చేయూత నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. విశాఖలో శుక్రవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, ఆర్థికాభివృద్ధి నిమిత్తం ఎన్నో పథకాలను అమలు చేయాలని నిర్ణయించామని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.65 కోట్లను కేటాయించారని తెలిపారు. ఈ మొత్తంలో నిరుపేద బ్రాహ్మణ విద్యార్థుల ఉపకార వేతనాలకు రూ.35 కోట్లను వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. భారతి పథకం ద్వారా విద్యార్థులకు ఉపకార వేతనాలు, వశిష్ఠ పథకం ద్వారా ప్రవేశ పరీక్షలకు శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. భారతి పథకం కింద ఒకటి నుంచి పిజి వరకూ అన్ని తరగతుల వారికి ఉపకార వేతనాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. అలాగే వశిష్ఠ పథకం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగాలకు సంబంధించి ప్రవేశ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు శిక్షణనిచ్చే బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టామని వెల్లడించారు. నిరుపేద బ్రాహ్మణ యువత ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ద్రోణాచార్య పథకం కింద రిటైల్ మార్కెటింగ్, ఐటి, ఇంజనీరింగ్, సోలార్ ఎనర్జీ, వంటి అంశాల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు తెలిపారు. నిరుపేద బ్రాహ్మణులను ఆరోగ్యపరంగా ఆదుకునేందుకు ఎన్‌టిఆర్ వైద్య సేవ పథకాన్ని వర్తింపచేయనున్నట్టు తెలిపారు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు శ్రీకృష్ణ సుధామ పథకం కింద విరాళాలను సేకరించే కార్యక్రమాన్ని ఎపి బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ చేపట్టిందన్నారు. బ్రాహ్మణుల అభ్యున్నతి, సంక్షేమాన్ని కాంక్షించే ప్రతి ఒక్కరినీ భాగస్వామ్యం చేయాలన్న లక్ష్యంతో అక్షయ బ్రాహ్మణ నిధిని ఏర్పాటు చేశామన్నారు. అంతకు ముందు చైర్మన్ కృష్ణారావు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. కార్యక్రమంలో కలెక్టర్ యువరాజ్, జిల్లా సమన్వయ కర్త వసంతవాడ పరుషోత్తం, శ్రీవాణి శ్రీనివాస శర్మ, సభ్యులు వెల్లంకి భానమూర్తి, తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ సామాజిక భవన నిర్మాణానికి అనువైన స్థలాన్ని పరిశీలించారు.