ఆంధ్రప్రదేశ్‌

రాజ్యసభ రేసు రసవత్తరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మే 25: నామినేషన్ల ప్రా రంభం కావడంతో రాజ్యసభ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. రాష్ట్రంలో మొత్తం నాలుగు స్థానాల కోసం ఈ ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో శాసనసభ్యుల మెజార్టీని బట్టి టిడిపి మూడు స్థానాలు, వైసిపి ఒక్క స్థానం గెలుచుకునే అవకాశం ఉంది. అయితే ఆ ఒక్క స్థానాన్ని కూడా టిడిపి గెలుచుకునేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఆ నాల్గవ స్థానానికి, నెల్లూరు జిల్లాకు లింకు ఏర్పడింది. దీంతో ప్రత్యక్ష ఎన్నిక కానప్పటికీ 4వ స్థానం కోసం పోటీపడనున్న ఇద్దరు వ్యక్తులు నెల్లూరు జిల్లాకు చెందిన వారనే సమాచారంతో జిల్లాలో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ముఖ్యంగా ఆయా పార్టీ కార్యాలయాల్లోనూ, సమావేశాల్లోనూ రాజ్యసభ ఎన్నికల గురించే కార్యకర్తలు వాకబు చేస్తుండడం గమనార్హం. జిల్లాకు చెందిన విజయసాయిరెడ్డి వైసిపి తరపున రాజ్యసభ స్థానానికి అభ్యర్థిగా గురువారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయనకు పోటీగా నాల్గవ స్థానం కూడా సాధించుకునేందుకు టిడిపి జిల్లాకే చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డిని రంగంలో దించే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. టిడిపి అభ్యర్థిగా కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా ఆయన్ను రంగంలోకి దించడం ద్వారా వైసిపి ఓట్లను చీల్చవచ్చనే అభిప్రాయంలో టిడిపి అధినేత ఉన్నట్లు తెలుస్తోంది. వేమిరెడ్డి ఈ నెల మొదటివారంలో టిడిపిలో చేరాల్సి ఉన్నప్పటికీ రాజ్యసభ ఎన్నికలయిన తర్వాత ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించే అవకాశం ఉందని జిల్లా టిడిపి నేత ఒకరు వ్యాఖ్యానించారు. ఇద్దరు నెల్లూరు వాస్తవ్యుల నడుమ ఈ దఫా రాజ్యసభ పోరు జరగనున్నట్లు ప్రస్తుత పరిణామాలు నేపథ్యంలో స్పష్టం అవుతోంది. ఒక వేళ జిల్లాకు చెందిన ఇతర నేతలెవరికైనా తమకు కచ్చితంగా వచ్చే మూడు స్థానాల్లో ఒకదానిని టిడిపి కేటాయించినప్పటికీ వేమిరెడ్డినే 4వ స్థానానికి పోటీలో దించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం.
క్యాంపుల గోలలో వైసిపి
రాజ్యసభ ఎన్నికల తేదీ సమీపిస్తుండడంతో తమ పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం లేని కొందరు వైసిపి సీనియర్ నేతలు విదేశాల్లో ఎమ్మెల్యేలకు క్యాంపులు ఏర్పాటు చేసేందుకు సిద్ధమైనట్లు సమాచారం. చిత్తూరు జిల్లాకు చెందిన ఒక వైసిపి ఎమ్మెల్యే దీనికి సంబంధించి బాధ్యతలు తీసుకొని జిల్లాకు చెందిన వైసిపి ఎమ్మెల్యేల పాస్‌పోర్టుల అడిగినట్లు తెలిసింది. పాస్‌పోర్ట్ లేని ఒక ఎమ్మెల్యే రెండు రోజుల క్రితం తిరుపతి పాస్‌పోర్టు కార్యాలయంలో పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ వ్యవహారంపై కినుక వహించిన జిల్లా ఎమ్మెల్యేలు సదరు ఎమ్మెల్యేతో పాటు విజయసాయిరెడ్డిపై కూడా అసహనం వ్యక్తం చేశారు. ఈ విషయం పార్టీ అధినేత జగన్ దృష్టికి రావడంతో విషయాన్ని సీరియస్‌గా తీసుకొని ఎమ్మెల్యేలతో పాటు ఈ క్యాంపు రాజకీయాలకు తెరదీసిన వ్యక్తులను కూడా మందలించినట్లు తెలిసింది.
హైదరాబాద్‌లో గురువారం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఎమ్మెల్యేలందరూ హాజరు కావాలని జగన్ ఆదేశించారు. దీంతో జిల్లాలోని వైసిపి ఎమ్మెల్యేలు హుటాహుటిన హైదరాబాద్ బయల్దేరివెళ్లారు. ఎన్నికల హడావుడి ప్రారంభ సమయంలోనే క్యాంపు రాజకీయాలు వెలుగులోకి రావడంతో టిడిపి శ్రేణులు అప్రమత్తం అవుతున్నాయి. ఎలాగైనా 4వ స్థానాన్ని కూడా కైవసం చేసుకోవాలనే తపనతో టిడిపి, తమకు దక్కాల్సిన స్థానాన్ని పొందాలనే తలంపుతో టిడిపి పోటీపడుతున్నాయి.