ఆంధ్రప్రదేశ్‌

ఆర్డీఎస్‌కు రైతుల బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 25: వివాదాస్పద ప్రాజెక్టు రాజోలిబండ డైవర్షన్ స్కీం (ఆర్డీఎస్) ఎత్తు పెంచడానికి కర్నాటక ప్రభుత్వం సిద్ధపడగా తమ వైపు పూడిక తీయడానికి తెలంగాణ ప్రయత్నిస్తోందని రైతులు మండిపడుతున్నారు.
ఎవరికి వారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటే రాయలసీమ రైతులు ఏం కావాలని ప్రశ్నిస్తూ ఎత్తుపెంపు పనులను అడ్డుకుంటున్నారు. ఆర్డీఎస్ ఎత్తు రెండు మీటర్ల మేర పెంచాలని కర్నాటక ప్రభుత్వం నిర్ణయించడానికి ముందు ఆంధ్రప్రదేశ్‌తో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందని వారు తేల్చి చెప్తున్నారు. ఎత్తు పెంపుప్రతిపాదనలు వచ్చిన నాటి నుంచి తాము అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా కన్నడ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై వారు మండిపడుతున్నారు. చివరకు ఇది మూడు రాష్ట్రాల సమస్యగా తయారైందంటున్నారు. ఒకవైపు తెలుగువారంతా ఒక్కటే అంటూ తోటి తెలుగువారి గొంతు కోయడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధపడటంపై రాయలసీమ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కర్నాటక పరిధిలోని భూభాగంలో జలాశయం పూడిక తీసేందుకు తెలంగాణ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. మొత్తం పూడిక తీయకుండా కేవలం తెలంగాణకు హక్కు ఉన్న తూముల వైపు పూడికతీస్తే ఎగువ నుంచి వచ్చే నీరంతా అటే పోతుందని, అప్పుడు రాయలసీమ రైతుల భవిష్యత్తు దుర్భరంగా మారుతుందని వారంటున్నారు. ఇలాంటి ప్రయత్నాలను తెలంగాణ విడిచిపెట్టి కర్నాటక జలదోపిడీని అడ్డుకోవడానికి తమతో కలిసి రావాలని రాయలసీమ రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. బలం ఉంది కదా అని ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటే సమస్య సద్దుమణగకపోగా మరింత జటిలమై రైతుల మధ్య యుద్ధం జరిగే పరిస్థితి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఒకచోట కూర్చొని అందరికీ అనుకూల నిర్ణయం తీసుకోవాలని అంటున్నారు.
కాగా కర్నాటక ప్రభుత్వంతో చర్చించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారులతో కూడిన ప్రతినిధుల బృందాన్ని పంపడానికి నిర్ణయించింది.. కర్నాటక ప్రభుత్వం నుంచి పిలుపు రాగానే బెంగళూరు వెళ్లి అక్కడి అధికారులతో ఈ బృందం మాట్లాడుతుంది. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవడానికి కర్నాటక కూడా సిద్ధంగా ఉన్నట్లు సంకేతాలు అందాయని అధికారులంటున్నారు. కాగా ఆర్డీఎస్ వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తెలంగాణ రాష్ట్ర పోలీసులు, నీటిపారుదలశాఖ, రెవెన్యూ అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

కొనసాగనున్న వేడిగాలులు
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 25: రాష్ట్రంలో కొన్ని చోట్ల వేడిగాలులు వీచడం కొనసాగుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు బుధవారం రాత్రి తెలిపారు. రాష్ట్రంలో చాలా చోట్ల వేడి, పొడి గాలుల ప్రభావం తగ్గినప్పటికీ, ఉష్ణోగ్రతలు కొనసాగుతాయని తెలిపారు. బుధవారం రామగుండంలో 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, బాపట్ల, కావలి, కాకినాడ, మచిలీపట్నంలో 44, ఒంగోలు, తుని, గన్నవరం, నందిగామలో 43, విశాఖ విమానాశ్రయంలో 39.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. రాగల 24 గంటల్లో రాష్ట్రంలో ఒకటి రెండు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
వడదెబ్బకు ఒకరు మృతి
ఏలూరు : గత నాలుగు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లాలో ఎండలకు, వడగాల్పులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. గోపాలపురం మండలం చెరుకుమిల్లిలో బుధవారం ఒక వృద్ధుడు వడదెబ్బతో మృతిచెందాడు.