ఆంధ్రప్రదేశ్‌

నలుగురు మావోల అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 23: ఈస్ట్ విశాఖ జాయింట్ డివిజన్ మావోయిస్టు ఏరియా కమిటీ సభ్యురాలు సహా మరో ముగ్గురు మిలీషియా సభ్యులను విశాఖ రూరల్ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఎస్పీ రాహుల్‌దేవ్ శర్మ మాట్లాడుతూ ఏరియా కమిటీ సభ్యురాలు వంతల వసంత అలియాస్ చీచు అలియాస్ జ్యోతి (26) సహా మిలీషియా సభ్యులు పాంగి సత్తిబాబు అలియాస్ గొర్లెమెట్ట సత్తిబాబు (40), పాంగి కామేశ్వరరావు అలియాస్ వంశీ (21), గెమ్మలి గోవిందరావు (26) లను అరెస్టు చేసినట్టు తెలిపారు. వసంతపై పలు కేసులున్నాయన్నారు. ఈమెపై 15 హత్య కేసులు, 10 బ్లాస్టింగ్ కేసులు, 5 ఆస్తుల ధ్వంసం కేసులు, 6 ఎదురు కాల్పుల కేసులు ఉన్నట్టు తెలిపారు. తూర్పు గోదావరి, ఒడిశా, విశాఖ ఏజెన్సీలో పలువురు మాజీ సర్పంచ్‌లు, గిరిజనుల హత్య కేసుల్లో వసంత పాత్ర ఉందన్నారు