ఆంధ్రప్రదేశ్‌

నదుల పునరుజ్జీవంతోనే ‘అనంత’ సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, మే 22: రాజస్థాన్‌లో తాను చూసిన పరిస్థితులే అనంతపురం జిల్లాలో కూడా ఉన్నాయని, అయితే ఇక్కడ రాజస్థాన్ కంటే 3 రెట్లు అధికంగా వర్షపాతం నమోదవుతోందని ఉత్తరప్రదేశ్ రాజ్‌పుత్ వంశస్థుడు, ఆయుర్వేద వైద్యుడు, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాళ్ మండలం దర్గాహొన్నూరు, తూటిగనూరు, ఇతర 10 గ్రామాల్లో దాదాపు 20వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న ఇసుక దిబ్బలు (మేటలు)న్న ప్రాంతాల్లో ఆదివారం ఆయన, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులుతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా రాజేంద్రసింగ్ ఇష్టాగోష్టి, అధికారులు, రైతులతో మాట్లాడారు. అనంతపురం జిల్లా సస్యశ్యామలంగా మారడానికి ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యలతో పాటు సంఘటిత చర్యలతో వేదవతి, హగరి నదులను పునరుజ్జీవింపజేయాలని సూచించారు. ప్రభుత్వం, ప్రజలు సంఘటితంగా వేదవతి, హగరి నదుల పునరుజ్జీవానికి కృషి చేయాలని కోరారు. అలాగే వర్షం నీటిని సంరక్షించుకోవాలన్నారు. రాజస్థాన్‌లో వర్షాలు కురవడంతో ఆ నీటితో భూమిలో తడిని పెంచేశామన్నారు. అలాగే వాగులు, వంకలు పారుతూ ఏడు నదులను జీవ నదులుగా మార్చామన్నారు. చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ జిల్లాలోని పరిస్థితుల్ని పరిశీలించి, ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజేంద్రసింగ్ ఇచ్చే సూచనలు, సలహాల మేరకు నీటి సంరక్షణ, వర్షంనీటి వినియోగంపై ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. కర్ణాటకలో మొదలై భైరవానితిప్ప ప్రాజెక్టు వద్ద వేదవతి, హగరి నదులు ఏపిలో అడుగిడుతున్నాయన్నారు. అయితే కర్ణాటకలో అధికంగా డ్యాంలు నిర్మించినందున జీవ నదులుగా ఉన్న ఇవి నేడు మృత నదులుగా మారాయన్నారు. ఈ నదుల్లో జల కళ తెచ్చేందుకు సర్ఫేస్ డ్యాంలు ఏర్పాటు చేసి, వాగులు, వంకలు బాగు చేసుకుంటూ నదులకు నీరు చేరేలా చేయాలన్నారు.
ఇందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రజలు కూడా భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. అనంతరం గోపాలపురంలో రాజేంద్రసింగ్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాజస్థాన్‌లో చేపట్టిన జల రక్షణ చర్యలను వివరించారు. ఈ సందర్భంగా గుమ్మఘట్ట మండలం భూపసముద్ర వద్ద పెద్దహగరి, చిన్న హగరి నదులు కలిసే చోట సబ్ సర్ఫేస్ డ్యాం నిర్మించేందుకు పనులు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. వారితో పాటు ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి ఉన్నారు.

రెండో భాగంలోని మార్కులే కీలకం
సబ్జెక్టు నిపుణుల అభిప్రాయం
ప్రశాంతంగా జెఇఇ అడ్వాన్స్‌డ్ పరీక్ష
ఆంధ్రభూమి బ్యూరో
విశాఖపట్నం, మే 22: ఐఐటిలో ప్రవేశాలకు సంబంధించిన జెఇఇ అడ్వాన్స్‌డ్ -2016 పరీక్ష ఆదివారం విశాఖలో ప్రశాంతంగా జరిగింది. 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ పరీక్షకు దాదాపు 7 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం, మధ్యాహ్నం రెండు భాగాలుగా ఈ పరీక్ష నిర్వహించారు. నగరంలోని ప్రభుత్వ మహిళా కళాశాల, వివిధ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ఈ పరీక్ష నిర్వహించారు. గత ఏడాది 360 మార్కులకు పరీక్ష నిర్వహించగా, ఈసారి 372 మార్కులకు పరీక్ష నిర్వహించడం గమనార్హం. అదనంగా గణితం, ఫిజిక్స్ , కెమిస్ట్రీల్లో నాలుగు మార్కుల చొప్పున ప్రశ్నలు ఇచ్చారు. ఉదయం నిర్వహించిన పార్ట్-1 పరీక్ష కొంత సులువుగా ఉన్నా, రెండో భాగం మాత్రం కష్టంగా ఉందని నిపుణులు చెపుతున్నారు. రెండు భాగాల్లో ఒక్కో సెక్షన్‌లో నెగిటివ్ మార్కుల నుంచి మినహాయింపు ఇచ్చారని తెలిపారు. ఫిజిక్స్‌లో రెండో భాగంలో నాలుగు ప్రశ్నలు చాలా కఠినంగా ఉన్నాయని, బాగా ప్రిపేర్ అయిన వారు మాత్రమే జవాబులు రాసే విధంగా ఉందని తెలిపారు. జవాబు రాసేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుందని తెలిపారు. ఫిజిక్స్‌లో ఒక ప్రశ్న తెలిసినదే అయినా టెన్షన్‌లో రాసే అవకాశం లేదని అంటున్నారు. కెమిస్ట్రీలో కూడా రెండో భాగంలో మూడు ప్రశ్నలు కఠినంగా ఉన్నాయి. దాదాపుగా రెండోభాగంలో ఎక్కువ కఠినంగా ప్రశ్నలు ఉన్నాయి. వాటిని సాధించేందుకు ఎక్కువ సమయం పడుతుంది. మొదటి భాగం కొంత సులువుగా ఉన్నప్పటికి రెండో భాగంలో ఎక్కువ మార్కులు సాధించిన వారికే మెరుగైన ర్యాంక్‌లు వస్తాయి.

‘ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు సిబిఐకి అప్పగించాలి’
ఏలూరు, మే 22: ఓటుకు నోటు అంటూ తెలంగాణ ప్రభుత్వం, ఫోన్ ట్యాపింగ్ అంటూ ఆంధ్రా ప్రభుత్వం గత ఏడాది హడావుడి చేసిన ఈ కేసులను కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ)కు అప్పగించాలని హైకోర్టు అడ్వకేట్స్ కమిటీ కన్వీనర్ బిఎస్‌ఎన్‌వి ప్రసాదబాబు కోరారు. ఈ కేసులపై ఇరు రాష్ట్రాల ప్రజల మదిలో అనేక సందేహాలున్నాయని, వాటిని నివృత్తి చేయడానికి కేసులను సిబిఐకి అప్పగించాలన్నారు. ఈమేరకు కేంద్ర హోంమత్రిత్వ శాఖకు లేఖ రాశామన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ఈ రెండు ఉదంతాల్లో స్పష్టమైన ఆధారాలున్నట్లు ఆయా ప్రభుత్వాలు బహిరంగంగానే ప్రకటించాయని, తరువాత రాజీ పడి కేసును నీరుగార్చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయన్నారు. దర్యాప్తు ఆలస్యమయ్యే కొద్దీ కీలక ఆధారాలు అదృశ్యమయ్యే ప్రమాదం కూడా ఉంటుందన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను, ఎన్నికల వ్యవస్థను అనేక చట్టాలను సవాలు చేస్తున్న జాతీయ ప్రాముఖ్యత గల ఉదంతాలుగా ఓటుకు నోటు, ఫోన్ ట్యాపింగ్ కేసులు మారాయన్నారు.
వీటిలో నిందితులుగా ఉన్న వారు సామాన్య వ్యక్తులు కారని, రెండు రాష్ట్రాల అధినేతలన్నారు. ఇప్పటికైనా ఈ కేసులను సిబి ఐకి అప్పగించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలన్నారు. ప్రజలకు సరైన సమాచారం అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. ఆయన వెంట ఎపి ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వివి ఆర్ కృష్ణంరాజు, జిల్లా నాయకులు జి సత్యనారాయణ ఉన్నారు.
నేటి నుంచి
పాలిసెట్ కౌనె్సలింగ్
విజయవాడలో రెండు కేంద్రాలు
25 నుంచి ఆప్షన్ల నమోదు
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 22: 2016-17 విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని పలు ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్ కాలేజీల్లో ఉన్న సీట్ల ప్రవేశానికి సంబంధించి ఈ నెల 23 నుండి 29 వరకు మొదటి విడత కౌనె్సలింగ్ జరగనుంది. ప్రత్యేక కేటగిరి కౌనె్సలింగ్‌ను విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహించనున్నారు. 23న ఆంగ్లో ఇండియన్, వికలాంగులు, ఆర్మీ సంతతికి చెందిన అభ్యర్థులకు ఒకటో ర్యాంకు నుంచి ఆఖరు ర్యాంకు వరకు కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున ఎన్‌సిసి అభ్యర్థులకు ఒకటో ర్యాంకు నుంచి 30వేల ర్యాంకు వరకు 24న క్రీడా అభ్యర్థులకు ఒకటో ర్యాంకు నుంచి 60వేల ర్యాంకు వరకు, 25న ఎన్‌సిసి, క్రీడా అభ్యర్థులకు 60,001 నుంచి ఆఖరు ర్యాంకు వరకు కౌనె్సలింగ్ నిర్వహించనున్నారు.
25 నుంచి ఆప్షన్ల నమోదు
ధ్రువీకరణ పత్రాల పరిశీలన చేయించిన ప్రత్యేక కేంద్రాల్లో అభ్యర్థులు 25, 26న ఒకటి నుంచి 30 వేల ర్యాంకు వరకు 27, 28న 30,001 నుంచి 60వేల ర్యాంకు వరకు, 29, 30న 60,001 నుంచి ఆఖరి ర్యాంకు వరకు ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. 31న ఆప్షన్లు మార్చుకునే వీలు కల్పించి జూన్ 2న ప్రవేశాలకు అనుమతిస్తారు.
విజయవాడలో రెండు కేంద్రాలు
ఎస్‌ఆర్‌ఆర్ డిగ్రీ కాలేజీలో ఒకటి నుంచి 7,500 ర్యాంకు వరకు, ఆంధ్ర లయోలా కాలేజీలో 7501 నుంచి 15వేల ర్యాంకు వరకు కౌనె్సలింగ్ ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి, ఓసి, మైనార్టీ అభ్యర్థులు పైన పేర్కొన్న తేదీల్లో రోజుకు 15వేల మంది చొప్పున సర్ట్ఫికెట్లను పరిశీలన చేయించుకోవాల్సి ఉంటుంది.
గుప్తనిధుల కోసం క్షుద్ర పూజలు
రాజమహేంద్రవరం పోలీసుల
అదుపులో నలుగురు
రాజమహేంద్రవరం, మే 22: గుప్త నిధుల కోసం క్షుద్రపూజలు, తవ్వకాలు జరుపుతున్నారన్న అనుమానంతో నలుగురు వ్యక్తులను తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రకాష్‌నగర్ సిఐ సుబ్రహ్మణ్యేశ్వరరావు కథనం ప్రకారం నారాయణపురంలోని గిడ్డంగుల సమీపంలో బుర్రిలంకకు చెందిన తడాల గణపతి అనే వ్యక్తి అద్దె ఇంట్లో నివసిస్తున్నాడు. అతని ఇంట్లో శనివారం రాత్రి గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు, తవ్వకాల కోసం సన్నాహాలు చేస్తున్నట్లు అనుమానించిన స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. పోలీసులు ఇంటిపై దాడి చేసి పసుపు, కుంకుమ రాసివున్న కత్తి, ఇతర పనిముట్లను స్వాధీనం చేసుకున్నారు. గణపతితోపాటు రంపచోడవరానికి చెందిన కె పార్వతిదేవి, కోసు వెంకన్నదొర, అమలాపురంనకు చెందిన కాళీ రామ్‌కుమార్ అనే వ్యక్తులు, పార్వతీదేవి కుమార్తె అయిన నాలుగేళ్ల చిన్నారిని అదుపులోకి తీసుకున్నారు. పార్వతిదేవికి శారీరక ఇబ్బంది తలెత్తడంతో వెంకన్నదొరతో పాటు తన ఇంటికి వచ్చినట్లు గణపతి పోలీసుల విచారణలో తెలిపాడు. తాము ఎలాంటి క్షుద్రపూజలు, తవ్వకాలు జరపడం లేదని స్పష్టం చేశాడు. ప్రకాష్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
నేడు ఏపిలో ఎడ్‌సెట్
ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 22: ఈ నెల 23న సోమవారం జరిగే ఏపి ఎడ్‌సెట్ - 2016 నిర్వహణకు ఏర్పాట్లు పూరె్తైనట్లు విజయవాడ సిటీ కో-ఆర్డినేటర్ ఎస్‌ఆర్‌ఎస్‌వి కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్ వారి బిఇడి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎ శ్రీనివాసమూర్తి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 పట్టణాల్లో 27 కేంద్రాల్లో 11,707 మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారని తెలిపారు. విజయవాడ నగరంలో రెండు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని, వీటిలో 887 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నారని తెలిపారు. కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ గుండా గంగాధర్ ఇదే ప్రకటనలో తెలుపుతూ విద్యార్థులు 45 నిమిషాలకు ముందుగా నగరంలోని ఎస్‌ఆర్‌ఆర్ అండ్ సివిఆర్ డిగ్రీ కళాశాల (మాచవరం), పిబి సిద్ధార్థ కాలేజి ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ (మొగల్రాజపురం) కేంద్రాలకు చేరాలని సూచించారు. నగర పరిధిలో గణితంలో 235, భౌతికశాస్త్రంలో 103, బయోలాజికల్ సైన్స్‌లో 151, సోషల్ స్టడీస్‌లో 369, ఇంగ్లీషులో 29 మంది అభ్యర్థులు హాజరవుతున్నారని తెలిపారు. అభ్యర్థులు డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఎపిఇడిసిఇటి.ఒఆర్‌జి వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.
అప్పుల బాధ తాళలేక
తండ్రి, కొడుకు ఆత్మహత్య
కుందుర్పి, మే 22: అప్పుల బాధ తాళలేక అభం శుభం తెలియని ఆరేళ్ల కొడుకుకు పురుగుల మందు కలిపిన భోజనం పెట్టి తండ్రి తిని ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన అనంతపురం జిల్లా కుందుర్పిలో చోటుచేసుకుంది. మృతుల బంధువులు తెలిపిన వివరాలు.. మండల కేంద్రమైన కుందుర్పికి చెందిన రైతు బంతుల నాగన్న (42) పంటల సాగు, పొలంలో బోర్లు వేయించేందుకు రూ. 2 లక్షలకు పైగా అప్పులు చేశాడు. బోర్లలో నీరు పడకపోగా అప్పులు తీర్చే మార్గం లేక జీవితంపై విరక్తి చెంది శనివారం రాత్రి అన్నంలో పురుగుల మందు కలిపి చిన్న కొడుకు మఖేష్ (6)తో కలిసి భోజనం చేసి నిద్రపోయారు. అప్పటికే ముఖేష్ మృతిచెందగా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న నాగన్నను కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి స్థానికులు తరలించగా అప్పటికే మృతి చెందాడు. కాగా భోజనం చేసే సమయంలో పెద్దకొడుకు అందుబాటులో లేకపోవడంతో బతికి బయటపడ్డాడు.