ఆంధ్రప్రదేశ్‌

స్వరాజ్య మైదానంలో సిటీ స్క్వేర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 22: విజయవాడ నడిబొడ్డులో ఆంధ్రప్రదేశ్‌కి గర్వకారణంగా నిలిచే నిర్మాణాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టనుంది. ఇప్పుడున్న స్వరాజ్య మైదానంలో విజయవాడ సిటీ స్క్వేర్‌ను నిర్మిస్తారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటైన ఉన్నత స్థాయి సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నమూనాను ధ్రువీకరించారు. చైనీస్ సంస్థ జీఐసిసి ఈ నమూనాకు రూపకల్పన చేసింది. విజయవాడ స్క్వేర్‌లో షాపింగ్ కాంప్లెక్స్‌లు, పార్కింగ్ ఏరియాలు ఉంటాయి. ఈ నిర్మాణం వల్ల విజయవాడ స్వరాజ్య మైదానంలో సమావేశాలు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకోవటానికి గతంలో కంటే రెండున్నర రెట్లు ఎక్కువ స్థలం అందుబాటులోకి వస్తుంది. వివిధ దశల్లో నిర్మాణాన్ని పూర్తి చేస్తారు. పూర్తయిన తర్వాత ఐదో పర్యాటక స్థలంగా రూపొందుతుంది. ఇందువల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం లభిస్తుంది. ప్రస్తుత సిఎం క్యాంప్ కార్యాలయానికి కూతవేటు దూరంలోనున్న ఈ స్వరాజ్య మైదానం చుట్టూ ఇటీవల ఇనుప కంచె వేయటంతో అన్నిపక్షాలు కలిసి ఆందోళన చేస్తున్నాయి. దశాబ్దాల తరబడి సభలు, సమావేశాలు జరుగుతుండేవని, ప్రస్తుతం ఈ స్థలాన్ని విదేశీ సంస్థలకు కట్టబెట్టబోతున్నారన్న ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంలో సిఎం చంద్రబాబు అసలేం జరుగబోతుందనే విషయాన్ని ఎట్టకేలకు నేడు బయటపెట్టారు. స్వరాజ్యమైదానం రైతుబజార్‌కు బదులుగా అలంకార్ థియేటర్ సమీపాన రూ.4 కోట్ల వ్యయంతో నూతన మోడల్ రైతు బజారు ఏర్పాటు చేస్తారు. ఈ రైతు బజారులో 350 స్టాళ్లను అత్యంత అధునాతన రీతిలో ఏర్పాటు చేస్తారు. సమావేశంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, సిఎంఓ ముఖ్య కార్యదర్శి శ్రీ సతీష్ చంద్ర, కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాబు ఎ, నగర పాలక సంస్థ కమిషనర్ వీరపాండియన్, ఇరిగేషన్ అధికారులు, చైనీస్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.