తెలంగాణ

కల్యాణలక్ష్మిలో అవినీతికి పాల్పడిన ఆరుగురి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినాయక్‌నగర్, మే 13: పెళ్లీడుకు వచ్చిన ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఆడపడుచుల తల్లిదండ్రులకు ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న కల్యాణలక్ష్మి పథకంలో నకిలీ పత్రాలతో అవినీతికి పాల్పడిన ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం నగరంలోని రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో డిఎస్పీ ఆనంద్‌కుమార్ నిందితుల వివరాలను వెల్లడించారు.
నిజామాబాద్ మండలం కల్పోల్, కల్పోల్‌తండా, ముదక్‌పల్లి గ్రామాలకు చెందిన రత్నావత్ కృష్ణ, రత్నావత్ సురేందర్, మేగావత్ రవి, బానోత్ రమేష్, మెగావత్ ప్రేమ్‌సాయి, గొల్లపల్లి ప్రదీప్‌చంద్ర అనే ఆరుగురు యువకులు కల్యాణలక్ష్మి పథకానికి తప్పుడు ధ్రువీకరణ పత్రాలను సృష్టించి 25లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు డిఎస్పీ వెల్లడించారు. ఇందులో కృష్ణ, ప్రదీప్‌లు ప్రధాన సూత్రదారులుగా వ్యవహరించారని, విఆర్‌ఓకు చెందిన నకిలీ స్టాంప్‌లతో పాటు ఆధార్‌కార్డులు, పెండ్లి పత్రికలను తయారు చేయించడం జరిగిందన్నారు. అనంతరం ముదక్‌పల్లిలోని మీసేవా కేంద్రం ద్వారా దరఖాస్తు ఫారాలను అప్‌లోడ్ చేయించి, ముదక్‌పల్లి సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ సరళకు ఒక్కో అప్లికేషన్‌కు 1000రూపాయల చొప్పున ముడుపులు ముట్టజెబుతూ విచారణ పూర్తి చేయించుకునేవారన్నారు.
ఇలా పూర్తి చేయించిన దరఖాస్తు ఫారాలు సంబంధిత శాఖకు పంపించి నిధులను మంజూరు చేయించుకునేవారన్నారు. ఇందుకు గాను ఒక్కో లబ్ధిదారుడి నుండి పెద్దమొత్తంలోనే నగదు దండుకునేవారని డిఎస్పీ వెల్లడించారు. అయితే ఈ విషయమై సంబంధిత ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల అధికారులకు అనుమానం రావడంతో ఎసిబి అధికారులకు సమాచారం అందించారన్నారు. ఈ మేరకు ఈ ముఠాపై పటిష్టమైన నిఘా పెట్టిన ఎసిబి, ఇటీవల వీరి గుట్టు రట్టు చేసిందన్నారు. అవినీతికి పాల్పడిన ఆరుగురు నిందితులపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు డిఎస్పీ వెల్లడించారు. వీరి నుండి నాలుగు ద్విచక్ర వాహనాలతో పాటు నకిలీ ధ్రువీకరణ పత్రాలు, పెళ్లి కార్డులు, ఫొటోలను స్వాధీనం చేసుకున్నట్లు డిఎస్పీ తెలిపారు.