తెలంగాణ

రాష్ట్రంలో అరాచక ప్రభుత్వం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 8: రాష్ట్రంలో ప్రజాస్వా మ్యం అదృశ్యమై, అరాచక శక్తుల ఆగడాలకు అడ్డూఅదుపూ లేకుండా పోతున్నదని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలు మల్లు రవి, వివేక్, ఇనగాల వెంకటరెడ్డి ఆరోపించారు.
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీకి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు కాంట్రాక్టర్లను చంపుతామని బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారంటే ఆ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. నిజాం పాలనలో వారు చేసిన అకృత్యాలపై ఎఫ్‌ఐఆర్ రాసే దిక్కేలేదని, కెసిఆర్ పాలనలో కూడా అదే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు ఎంతో పవిత్రమైందని, నైతిక విలువలు కలిగివున్న అభ్యర్థికే ఓటేయాలని సూచించారు. గతంలో జీవన్‌రెడ్డి తన మంత్రి పదవికి రాజీనామా చేసి కెసిఆర్‌పై పోటీ చేశారని, తుమ్మల నాగేశ్వరరావు కూడా తన ఎమ్మెల్సీ, మంత్రి పదవులకు రాజీనామా చేసి పాలేరు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే గౌరవప్రదంగా ఉండేదన్నారు. కెసిఆర్ ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారని, ఎక్కడ చూసినా వందలాది వాహనాలతో కాన్వాయ్ తిరుగుతున్నా, ఎన్నికల అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపించారు. టిఆర్‌ఎస్ విపక్షాల ప్రజాప్రతినిధులను అంగట్లో సరుకుల మాదిరిగా ఎంత రేటైనా కొనేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాల హయాంలోనే అభివృద్ధి జరిగిందని, టిఆర్‌ఎస్ రెండేళ్ల పాలనలో పాలేరులో ఒరిగిందేమీ లేదని విమర్శించారు. పాలేరులో తుమ్మల ఓడిపోతే కెటిఆర్ రాజీనామా చేస్తానని అంటున్నారని, తుమ్మల ఓడిపోతే...కెసిఆర్ రాజీనామా చేస్తారా? అని సవాల్ విసిరారు. పాలేరు అభివృద్ధికి కృషి చేసిన దివంగత నేత రాంరెడ్డి వెంకటరెడ్డి సతీమణి సుచరితకు అత్యధిక ఓట్లేసి గెలిపించాలని కోరారు. మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, మాజీ ఎంపి వివేక్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అయితం సత్యం తదితరులు పాల్గొన్నారు.

విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న
మల్లు రవి, ఇనగాల వెంకటరెడ్డి