తెలంగాణ

పాలేరులో ఓడిపోతే మంత్రి పదవికి రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 8: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో టిఆర్‌ఎస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు ఓడిపోతే తాను పదవికి రాజీనామా చేస్తానని, కాంగ్రెస్ అభ్యర్థి సుచరితారెడ్డి ఓటమి పాలైతే ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రాజీనామా చేస్తారా? అని కెటిఆర్ సవాల్ విసిరారు. ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖమ్మంలో ఆయన ఆదివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ మంచితనం, మానవత్వం, నైతిక బాధ్యతలాంటి పదాలను ఉపయోగిస్తూ కాంగ్రెస్ నేతలు నీచరాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. బాధలో ఉన్న మహిళను ఎండలో తిప్పుతూ ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. నాడు తెలంగాణ రాష్ట్రం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన శ్రీకాంతాచారి తల్లి పోటీ చేస్తే గుర్తుకు రాని మానవత్వం, మంచితనం గురించి ఆ పార్టీ నేతలు ఇప్పుడు మాట్లాడుతుండటం బాధాకరమన్నారు. తమ పార్టీ అగ్రనేత పివి నర్సింహారావు భౌతికకాయం పూర్తిగా దహనం కాకుండానే వదిలేసిన నేతలు ప్రజల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ప్రజా సమస్యల పరిష్కారంపైనే దృష్టి సారించామని స్పష్టం చేశారు. ప్రతి ఇంటికి మంచినీరు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగమని చెప్పిన ఘనత తమ ముఖ్యమంత్రికే దక్కిందని వెల్లడించారు. పాలేరు ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ గెలుపు ఖాయమని, దానిని తట్టుకోలేకనే కాంగ్రెస్ నేతలు అనవసర విమర్శలకు పాల్పడుతున్నారని ఎద్దేవా చేశారు. 2006లో ఉప ఎన్నికల్లో కెసిఆర్ గెలుపు ఎలా ఉందో తుమ్మల విజయం అలా ఉంటుందని జోస్యం చెప్పారు. పాలేరు ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్లతో పాటు ఈవిఎంలకు ప్రింటర్లు అమర్చినా తమకు సమ్మతమేనని, ఏ విధంగా ఎన్నిక జరిగినా గెలుపు తమదేనని ధీమా వ్యక్తం చేశారు. పాలేరు నియోజకవర్గంలో ప్రజల నుంచి తమకు వస్తున్న స్పందనను చూసి తట్టుకోలేక చేస్తున్న ఆరోపణలకు అదే ప్రజలు ఈ ఎన్నికల్లోనే గుణపాఠం చెప్తారని స్పష్టం చేశారు.