తెలంగాణ

మ్యాన్‌హోల్ దుర్ఘటనపై హైకోర్టు సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 5: హైదరాబాద్‌లో ఇటీవల మ్యాన్‌హోల్‌లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై హైకోర్టు సీరియస్ అయింది. జిహెచ్‌ఎంసి, హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. తెలంగాణ మున్సిపల్ శాఖ, హోంశాఖ ఈ సంఘటనపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు గురువారం ఆదేశించింది. జస్టిస్ ఏ రాజశేఖర రెడ్డి, జస్టిస్ ఏ శంకర్ నారాయణతో కూడిన ధర్మాసనం ఈ ఉదంతాన్ని సుమోటోగా స్వీకరించింది. ప్రమాదం జరిగిన మ్యాన్‌హోల్ వద్ద డ్రైనేజీ సమస్యపై ఎన్ని ఫోల్ కాల్స్ వచ్చాయి, ఎంత మంది మరమ్మత్తు చేసేందుకు హాజరయ్యారో వివరాలు తెలియచేయాలని హైకోర్టు ఆదేశించింది. డ్రైనేజీ శుభ్రతకు సంబంధించి నిబంధనలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది.