ఆంధ్రప్రదేశ్‌

విశాఖ ఏజెన్సీలో 10 మందికి ఆంత్రాక్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 5: విశాఖ జిల్లా హుకుంపేట మండలం పనసపుట్టు గ్రామానికి చెందిన 10 మందికి ఆంత్రాక్స్ సోకినట్లు గ్వాలియర్‌లోని ప్రయోగశాల నిర్ధారించింది. గ్రామానికి చెందిన 19 మంది ఆంత్రాక్స్ లక్షణాలతో విశాఖలోని కింగ్‌జార్జి ఆసుపత్రిలో వైద్యచికిత్స నిమిత్తం చేరిన సంగతి తెలిసిందే. వారి రక్తనమూనాలను సేకరించిన గ్వాలియర్ ప్రత్యేక బృందం ప్రయోగశాలకు పంపింది. అక్కడ వీటిని పరీక్షించిన శాస్తవ్రేత్తలు 10 మందికి వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. వారికి మెరుగైన చికిత్స అందించాలని కెజిహెచ్ అధికారులకు సూచించారు. చనిపోయిన పశువుల మాంసం తినడం వల్ల ఆంత్రాక్స్ సోకినట్లు నిర్ధారించారు.