ఆంధ్రప్రదేశ్‌

నేడు, రేపు దండకారణ్య బంద్‌కు మావోల పిలుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, మే 3: దండకారణ్యంలో మావోయిస్టులను అణచివేయడానికి ప్రభుత్వం చేపడుతున్న వైమానిక దాడులకు వ్యతిరేకంగా మావోయిస్టులు 4, 5 తేదీల్లో దండకారణ్య బంద్‌కు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా మండలంలోని ఏడుగుర్రాలపల్లి, పేగ గ్రామాల నడుమ పలుచోట్ల రహదారులపై కందకాలు తవ్వారు. చెట్లను నరికి రహదారికి అడ్డంగా పడవేశారు. అలాగే ఏడుగుర్రాలపల్లి, కాటుకపల్లి గ్రామాల మధ్య జాతీయ రహదారి-30పై కరపత్రాలు, పోస్టర్లు వదిలి వెళ్లారు. సిపిఐ మావోయిస్టు ఖమ్మం జిల్లా కమిటీ పేరుతో ఈ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. ఇందులో ఆపరేషన్ గ్రీన్‌హంట్ దాడులను ఎదుర్కోవాలని, పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలపై, విప్లవ ఉద్యమాలపై పోలీసులు చేస్తున్న ఆపరేషన్ గ్రీన్ హంట్ మూడో బహుముఖ దాడిని సమర్ధవంతంగా తిప్పికొడతామని పేర్కొన్నారు. అలాగే ప్రకృతి వనరుల దోపిడీకి పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
మావోయిస్టులది పిరికిపంద చర్య: ఒఎస్‌డి ఫకీరప్ప
ప్రజల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నామని చెప్పుకునే మావోయిస్టులు ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా రహదారిపై కందకాలు తవ్వడం, చెట్లను నరికి రహదారికి అడ్డంగా పడవేయడం ఏమిటని ఎటపాక ఒఎస్‌డి ఫకీరప్ప ప్రశ్నించారు. పోలీసులు గిరిజన ప్రాంతాల్లో గిరిజనుల అభివృద్ధికి కృషిచేస్తుంటే మావోయిస్టులు అభివృద్ధికి ఆటంకం కలిగించడం హేయమైన చర్యగా ఆయన అభివర్ణించారు. అమాయక గిరిజనులను పోలీసు ఇన్‌ఫార్మర్ల నెపంతో హతమార్చడం సరికాదన్నారు. మావోయిస్టులు తమ ఉనికిని చాటుకునేందుకే ఇటువంటి పిరికిపంద చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు.

కరవుపై అధ్యయనానికి రెండు బృందాలు

ఫిరాయింపులు, బుజ్జగింపులకే పరిమితమవుతున్న బాబు పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, మే 3: రాష్ట్రంలో కరవు విలయతాండవం చేస్తున్న నేపధ్యంలో కరవును అధ్యయనం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు కరవు బృందాలను ఏర్పాటు చేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. శ్రీకాకుళం నుండి పశ్చిమగోదావరి వరకు ఓ బృందం, రాయలసీమలోని నాలుగు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో మరో బృందం పర్యటిస్తుందని ఆయన తెలిపారు. కరవుపై కృష్ణా, గుంటూరు జిల్లాల నాయకులతో పిసిసి భవన్‌లో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం ఆయన సమావేశంలో మాట్లాడుతూ కరవును ఎదుర్కోవడంలో విఫలమైన ప్రభుత్వంపై పెద్దఎత్తున పోరాడాలని నిర్ణయించారు. తాను నంబర్ వన్ కూలీని అని చెబుతున్న చంద్రబాబు రాష్ట్రంలో కరవుతో 20 లక్షల మంది కూలీలు వలసబాట పట్టారని వారందరికీ ఆయన ప్రతినిధా అని ప్రశ్నించారు. కరవు వస్తుందని ఇలాంటి దయనీయ స్థితి ఎదురవుతుందని ముందే తెలిసినా ప్రభుత్వం ముందు జాగ్రత్త తీసుకోవడంలో ఘోర వైఫల్యం చెందడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వేలాది గ్రామాల్లో ప్రజలు గుక్కెడు మంచినీటి కోసం అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పశుగ్రాసం లేక పశువులను కళేబరాలకు అమ్ముకుంటూ రైతులు కన్నీరు కారుస్తున్నారన్నారు. అన్ని రాష్ట్రాలు కేంద్రం నుండి కరవు సహాయనిధి కింద వేల కోట్ల రూపాయలు తెచ్చుకుని జాగ్రత్తపడ్డా చంద్రబాబు ముందుచూపు లేకుండా పోయిందన్నారు. ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై ఈ నెల 16న వామపక్షాలు చేస్తున్న ఆందోళనకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని ప్రకటించారు. కర్నూలు జిల్లాల్లో ఓ ఎమ్మెల్యేను బుజ్జగించడానికి అరడజను మంది మంత్రులు రంగంలో దిగారని వీరు పాలనను ఎటు తీసుకెళుతున్నారని ప్రశ్నించారు. ఫిరాయింపులు, బుజ్జగింపులే ఫుల్‌టైమ్‌గా పెట్టుకుని పనిచేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులు తులసిరెడ్డి, కొలనుకొండ శివాజీ, మల్లాది విష్ణు, ఎన్.నరసింహారావు పాల్గొన్నారు.
విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న రఘువీరారెడ్డి