తెలంగాణ

ఇళ్లకు లైన్‌క్లియర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 27: రాష్ట్రంలో రెండు లక్షల డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇళ్ల నిర్మాణానికి మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే రెండు లక్షల ఇళ్లు నిర్మించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు, పట్టణ ప్రాంతాలు, హైదరాబాద్ పరిధిలో ఈ రెండు లక్షల ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో ఇంటి వ్యయం ఐదు లక్షల నాలుగు వేల రూపాయలుగా నిర్ణయించారు. హైదరాబాద్ వినా మిగిలిన తొమ్మిది జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్ వ్యయం ఐదు లక్షల 30 వేలుగా నిర్ణయించారు. హైదరాబాద్ పరిధిలో మాత్రం ఒక్కో యూనిట్ వ్యయం ఏడు లక్షల రూపాయలుగా నిర్ణయించారు. వౌలిక సదుపాయాల కోసం గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కో యూనిట్‌కు లక్షా 25వేల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో 75 వేల రూపాయలుగా నిర్ణయించారు. జిల్లా కలెక్టర్లు, జిహెచ్‌ఎంసి కమిషనర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి తక్షణం అవసరమైన చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులో పేర్కొన్నారు.