ఆంధ్రప్రదేశ్‌

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా శివాజీ బాధ్యతల స్వీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 26: దళిత, గిరిజన, అట్టడుగు వర్గాలకు అండగా ఎస్సీ, ఎస్టీ కమీషన్ పని చేస్తుందని కమీషన్ నూతన చైర్మన్ కారెం శివాజి తెలిపారు. రాష్ట్రంలో స్వయం ఉపాధి కోసం బ్యాంకులు దళిత, గిరిజన వర్గాల యువతకు రుణాలు అందించాలని లేకపోతే కమిషన్ వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో దళిత, గిరిజన వర్గాలవారికి సముచిత స్థానం ఇవ్వడంతోపాటు వారికి సమాన ప్రాధాన్యతను ఇచ్చి బ్యాక్‌లాగ్ పోస్టులను భర్తీ చేయాలని లేని పక్షంలో వారికి ఉద్వాసన తప్పదని ఆయన హెచ్చరించారు. మంగళవారం రాత్రి శివాజీ తో రాష్ట్ర మంత్రి రావెల కిషోర్ బాబు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమీషన్ చైర్మన్‌గా ప్రమాణస్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు రావెల కిషోర్ బాబు, పీతల సుజాత తదితరులు హాజరయ్యారు.
హైకోర్టు నోటీసులు
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా కారెం శివాజీ నియామకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు మంగళవారం చైర్మన్ శివాజీకి, రాష్ట్రప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఈ నియామకాన్ని సవాలు చేస్తూ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన జెవి ప్రసాద్ అనే న్యాయవాదితోపాటు మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ పివి సంజయ్ కుమార్ విచారించారు. శివాజీపైన క్రిమినల్ కేసులు ఉన్నాయని, చట్టప్రకారం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ పదవిలో ఆయనను నియమించరాదంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్‌గా పదవీ బాధ్యతలు స్వీకరిస్తున్న కారెం శివాజీ

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి
ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు
డాక్టర్ నాగేశ్వరరెడ్డి సహా 8 మంది నియామకం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, ఏప్రిల్ 26: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి రాష్ట్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌ను నియమించారు. ఇందులో ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరెడ్డి, ఎల్‌వి ప్రసాద్ కంటి ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ గుల్లపల్లి నాగేశ్వరరావు, కర్నూలు మెడికల్ కాలేజీ రిటైర్డ్ ప్రిన్సిపాల్ డాక్టర్ జి భవానీప్రసాద్, శుభం ప్రేమ ఆస్పత్రిలో గైనకాలజిస్టు డాక్టర్ రొక్కం శశిప్రభ, శ్రీ వేంకటేశ్వర మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ బదూర్ మనోహర్, గుంటూరు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ కె ఎస్ వరప్రసాద్, విజయవాడ ప్రభుత్వ డెంటల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ టి మురళీ మోహన్, కర్నూలు మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ పి చంద్రశేఖర్‌లు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులుగా నియమితులయ్యారు.