ఆంధ్రప్రదేశ్‌

ఉజ్వల యోజన పథకాన్ని పటిష్ఠంగా అమలు చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: ప్రధాన మంత్రి ఉజ్వల యోజన కింద పంపిణీ చేసే ఎల్‌పిజి సిలెండర్లు దుర్వినియోగం కాకుండా పటిష్టమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని తెలుగుదేశం ఎంపీ కేశినేని శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేశినేని సోమవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఎల్‌పిజి కనెక్షన్లకు సంబంధించి ఒక అనుబంధ ప్రశ్నపై మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఉజ్వల పథకం కింద లబ్ధిదారుల ఇంటి వద్ద సిలెండరును పంపిణీ చేయడం మంచి విధానమన్నారు. అయితే పథకం దుర్వినియోగం కాకుండా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోంటోందని ఆయన ప్రశ్నించారు. ప్రతి ఇంటికీ సిలెండరును పంపిణీ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
డీలర్ల జవాబుదారీ కోసం ఏం చర్యలు చేపట్టారని అడిగారు. ఈ పథకం పరిధిలోని వినియోగదారుల సమస్యల పరిష్కారానికి ఏదైనా గ్రీవియన్స్ రిడ్రెసల్ యంత్రాంగాన్ని ఏర్పాటు చేస్తున్నారా? అని కేశినేని ప్రశ్నించారు. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్‌లో ఎల్‌పిజి సిలెండర్ల ఉత్పత్తి కార్మాగారాన్ని ఏర్పాటు చేయాలని లోక్‌సభలో టిడిపి పక్షం నాయకుడు తోట నరసింహం డిమాండ్ చేశారు. టిఆర్‌ఎస్ కొండా విశే్వశ్వర రెడ్డి మాట్లాడుతూ ఎల్‌పిజి స్థానంలో బయో గ్యాస్‌ను సరఫరా చేయాలని సూచించారు. తన చేవెళ్ల నియోజకవర్గంలోని దాదాపు 50 శాతం ఇళ్లలో ఎల్‌పిజి కనెక్షన్ ఉందని, కొన్ని సుదూర గ్రామాలు, తాండాల్లో మాత్రం ఈ సౌకర్యం లేదని వివరించారు. ఎల్‌పిజి స్థానంలో బయోగ్యాస్‌ను ఉపయోగించే వారికి ప్రభుత్వం రాయితీ ఇస్తుందా? అని విశే్వశ్వర రెడ్డి ప్రశ్నించారు. పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ బదులిస్తూ ప్రస్తుతానికి బయోగ్యాస్ వాడకందారులకు రాయితీ ఇచ్చే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని స్పష్టం చేశారు.