ఆంధ్రప్రదేశ్‌

వేద మంత్రాల మధ్య సచివాలయంలోకి సిఎం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 25: దేశ విదేశీ పవిత్ర స్థలాల నుంచి సేకరించిన పవిత్ర మట్టి, జలంతో శుద్ధి అయిన నవ్యాంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరంలో కేవలం 62 రోజుల వ్యవధిలోనే ఓ కొలిక్కివచ్చిన ప్రభుత్వ భవనాల సముదాయంలోకి వేదమంత్రాలతో మంగళవాయిద్యాలు, శాస్త్రోక్తంగా జరుగుతున్న హోమాలు, పూజాదికాల మధ్య సోమవారం తెల్లవారుఝామున సరిగ్గా 4.01 నిమిషాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుగుపెట్టారు. అర్ధరాత్రి నుంచే అక్కడ వివిఐపిలు, విఐపిల తాకిడి ఆరంభమైంది. వీరంతా ఎదురేగి ముఖ్యమంత్రి చంద్రబాబును తోడ్కొని వచ్చారు. సాధారణ రోజుల్లో మాదిరిగా ప్యాంట్, షర్ట్‌తోనే వచ్చిన ముఖ్యమంత్రి బూట్లు బైట విడిచి సాక్స్‌తోనే కూడికాలు లోపలికి పెట్టి కొత్త భవనంలోకి ప్రవేశించారు. ముందుగా గుమ్మడికాయ పగులగొట్టి, తర్వాత ప్రత్యేకంగా తీర్చిదిద్దిన కార్యాలయ గదికి రిబ్బన్ కట్ చేసి పక్కనున్న శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఓవైపు పూజాదికాలు జరుగుతుంటే మరోవైపు మంత్రులు, నాయకులు బారులుదీరి ఆయనకు శాలువాలు కప్పి పుష్పగుచ్ఛాలు అందజేశారు. నిర్ణీత సమయానికి ముందే రాజధానికి తరలివచ్చేలా నిద్రహారాలు లేకుండా పాటుబడ్డారంటూ అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యమంత్రి వారందరికీ వినమ్రంగా కృతజ్ఞతలు తెలిపారు. హోమంలో పూజాదికాల అనంతరం తుళ్లూరు మండల ప్రజాపరిషత్ అధ్యక్షురాలు పద్మలత పొయ్యి వెలిగించి పాలు పొంగిస్తుంటే ముఖ్యమంత్రి ఆసక్తిగా గమనించారు. ముందెన్నడూ లేనివిధంగా తొలిసారి ప్రభుత్వ కార్యాలయాలను తెల్లవారుఝామున ప్రారంభించడంపై పలువురు విమర్శలు గుప్పించారు. ఎంతో కీలకమైన రాజధాని నగరంలో కీలకమైన సచివాలయం ప్రారంభోత్సవానికి మంత్రులు, ఎంపిలు, ఎమ్మెల్సీలు నామమాత్రంగానే హాజరుకావటం చూపరులను ఆశ్చర్యపర్చింది. ఇదిలావుంటే, మంత్రులు రావెల కిషోర్‌బాబు, పీతల సుజాత, మరికొందరు నేతలు ముఖ్యమంత్రికి పాదాభివందనం చేశారు. సభావేదికపై చంద్రబాబుతో పాటు శాసన సభాపతి కోడెల శివప్రసాదరావు, శాసనమండలి చైర్మన్ చక్రపాణి, ఉప సభాపతి మండలి బుద్ధప్రసాద్, ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు పల్లె రఘునాథరెడ్డి, ప్రత్తిపాటి పుల్లారావు, రావెల కిషోర్‌బాబు, పి నారాయణ, ఎన్జీవో సంఘ అధ్యక్షుడు పి అశోక్‌బాబు, సచివాలయ ఉద్యోగుల సంఘ అధ్యక్షుడు మురళీకృష్ణ, ప్రధాన కార్యదర్శి ఎస్‌పి టక్కర్, ప్రిన్సిపల్ సెక్రటరీ అజయ్ జైన్, స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్, సిఆర్‌డిఏ కమిషనర్ ఎన్ శ్రీకాంత్, తదితరులు ఆశీనులయ్యారు. గుంటూరు కలెక్టర్ కాంతిలాల్ దండే సభా కార్యక్రమాన్ని నిర్వహించారు.

చిత్రం అమరావతిలో రిబ్బన్ కట్ చేసి తాత్కాలిక సచివాలయ భవనాన్ని సోమవారం ప్రారంభిస్తున్న
ముఖ్యమంత్రి చంద్రబాబు.