ఆంధ్రప్రదేశ్‌

హార్టికల్చర్ హబ్‌గా కడప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప,ఏప్రిల్ 25: రాష్టవ్య్రాప్తంగా నీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.13,241కోట్లు ఖర్చు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. కడప జిల్లాను రాష్ట్రంలోనే హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దుతామని, ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని, జిల్లాలోని చిత్రావతి, పెన్న, పాపాగ్ని నదులతో పాటు 644 చెరువులను అనుసంధానంచేసి నీటి సమస్య లేకుండా చేస్తానని పేర్కొన్నారు. సోమవారం ఆయన నగర సమీపంలోని ఒక ప్రైవేట్ కనె్వన్షన్ హాల్‌లో నీటి సంఘాల ప్రతినిధులతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం జలవనరుల అభివృద్ధినిమిత్తం ప్రవేశపెట్టిన నీరు-చెట్టు, పంట సంజీవిని కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తున్నాయన్నారు. వీటిపై నీటి సంఘాల ప్రతినిధులు శ్రద్ధ చూపించాలన్నారు. భూగర్భజలాలు పెరిగినప్పుడే అభివృద్ధి ఉంటుందనే విషయం అందరూ గ్రహించాలన్నారు. సాగునీటి సంఘాలు, జలవనరుల శాఖ ద్వారా వర్షపునీటిని నిల్వచేసేందుకు చెరువులు, కుంటలు, చెక్‌డ్యామ్‌ల పూడిక తీసి రానున్న వర్షాకాలంలో అధికశాతం నీటి నిల్వకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలోని చెరువులకు గొలుసుకాలువలు తీసి చెరువులను ఆక్రమణలను అడ్డుకుని, వర్షపునీరు నిల్వచేసేందుకు ఎన్ని నిధులైనా ఖర్చు చేస్తామన్నారు. కృష్ణాజలాలు ఈప్రాంతానికి వచ్చేందుకు గాలేరు-నగరి, హంద్రీ-నీవా ప్రాజెక్టుల పనులు శరవేగంగా చేపడుతున్నామని, దివగంత నేత ఎన్‌టిఆర్ నిర్మించిన తెలుగుగంగప్రాజెక్టు ఓపెన్ చానల్ ద్వారా నీటిని అందిస్తామని ఆయన పేర్కొన్నారు. చెక్‌డ్యామ్‌లు, కోనేటి గుంతలు, పారంఫాండ్స్ అధికంగా నిర్మించుకోవాలని వాటిని మరమ్మతులు చేసుకోవాలని , పూడిక తీయించుకోవాలని ఆయన కోరారు.

చిత్రం రామాపురం మండలంలో జరిగిన సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి