ఆంధ్రప్రదేశ్‌

తుని ఘటనలో రౌడీషీటర్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, ఏప్రిల్ 24: తుని ఘటనలో రౌడీషీటర్ల ప్రమేయం ఉందని ఇంటెలిజెన్స్ నివేదికలో తేలిందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. విచారణ పూర్తయిన వెంటనే నిందితులు ఎంతటి వారయినా కఠినంగా శిక్షిస్తామని హెచ్చరించారు. గుంటూరు జిల్లా తెలుగుదేశం పార్టీ సమన్వయ సమావేశానికి హాజరైన సందర్భంగా ఆదివారం ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవహారశైలికి భరించలేక ఆ పార్టీ ఎమ్మెల్యేలు టీడీపి వైపు ఆకర్షితులవుతున్నారని చెప్పారు. డబ్బులతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అగత్యం తమ పార్టీకి లేదన్నారు. అక్రమ ఆస్తులకు సంబంధించి 12 కేసులలో ఏ వన్ ముద్దాయిగా ఉన్న జగన అందరినీ దొంగలుగా భావించడం సరికాదన్నారు. ఎమ్మెల్యేలతో ఎలా మెలగాలో తెలీని జగన్ ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు చేయటం విడ్డూరమన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు.. రాజధాని.. రాష్ట్ర అభివృద్ధిలో జగన్ శిఖండిలా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రజా స్వామ్య విలువల గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని వ్యాఖ్యానించారు. పార్టీ ఫిరాయింపులను ప్రేరేపించింది తన తండ్రి వైఎస్సే అని జగన్ గ్రహించాలన్నారు. మాజీ ప్రధానమంత్రి పీవి నరసింహారావు ప్రభుత్వాన్ని కాపాడేందుకు ఏడుగురు పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేసింది వైఎస్ కాదా అని ప్రశ్నించారు. అణు ఒప్పం దం విషయంలో కూడా రాష్ట్రంలో సీఎంగా ఉండి లోక్‌సభ, పార్లమెంటు సభ్యులను కొనుగోలు చేశారని, చివరకు అనంతపురం జెడ్పీ చైర్మన్ పదవి కోసం ఇద్దరు జెడ్పీటీసీలను సైతం ప్రలోభపెట్టారని ఆరోపించారు. ఫిరాయింపుల గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్‌కు లేదన్నారు. ఆయనకు ముఖ్యమంత్రి పదవి కావాలనే తపన తప్ప ప్రజలకు మేలుచేయాలనే ధ్యాస లేదన్నారు. తండ్రి మృతదేహాన్ని పక్కనే పెట్టుకుని సంతకాలు సేకరించిన ఘనుడు జగన్ అని విమర్శించారు. ఆయన ప్రవర్తన నచ్చకే ఆ పార్టీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరుతున్నారని తెలిపారు. మరో మంత్రి రావెల కిషోర్‌బాబు మాట్లాడుతూ వైకాపా ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న నేపథ్యంలో జగన్ పిచ్చోడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. వైసీపీ మునిగిపోయే నావగా అభివర్ణించారు. అలాంటి పార్టీలో ఎవరూ ఉండాలని కోరుకోరన్నారు. చివరకు ఫ్లోర్ లీడర్ జ్యోతుల నెహ్రూను సైతం శాసనసభలో మాట్లాడనివ్వకుండా తన ఆధిపత్యం కోసం నియంతృత్వ ధోరణితో వ్యవహరించినందు నే ఎమ్మెల్యేలు చేజారుతున్నారని తెలిపారు. భవిష్యత్తులో ఏపిలో తెలుగుదేశం పార్టీ ఒక్కటే ఉంటుందని జోస్యం చెప్పారు. జగన్ జైలులోలోనో లేక బెంగుళూరులో వ్యాపారాలు చేసుకోవాల్సి వస్తుంది తప్ప రాజకీయ భవిష్యత్తులేదని విమర్శించారు.